దిల్ రాజు చేతికి ది ప్యారడైజ్.. నిర్మాత ఏమన్నారంటే? | Dila raju Buys nani The paradise Movie distribution Rights clarity | Sakshi
Sakshi News home page

The paradise Movie: దిల్ రాజు చేతికి ది ప్యారడైజ్.. నిర్మాత ఏమన్నారంటే?

Jul 15 2026 8:07 PM | Updated on Jul 15 2026 8:14 PM

Dila raju Buys nani The paradise Movie distribution Rights clarity

నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది. అయితే మరోసారి కూడా వాయిదా పడనుందనే వార్తలొస్తున్నాయి.

ది ప్యారడైజ్ వాయిదా వార్తల వేళ మరో న్యూస్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. నాని మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నిర్మాత దిల్‌ రాజు దక్కించుకున్నారని ఓ టాక్ వైరలవుతోంది. తాజాగా ఈ వార్తలపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. అలాంటిదేం జరగలేదని ఆయన క్లారిటీ ఇ‍చ్చారు. పంపిణీ హక్కుల గురించి ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని  కోరారు. ఏదైనా అధికారిక సమాచారం మా అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. దీంతో ది ప్యారడైజ్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement