‘ఎలగే పిల్ల’ పాట ‍క్యాచీగా ఉంది : నాగవంశీ | Yelage Pilla Song Released From Anakapalli Movie | Sakshi
Sakshi News home page

‘ఎలగే పిల్ల’ పాట ‍క్యాచీగా ఉంది : నాగవంశీ

Jul 15 2026 5:54 PM | Updated on Jul 15 2026 5:58 PM

Yelage Pilla Song Released From Anakapalli Movie

 విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’.భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్  బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. 

తాజాగా ఈ చిత్రంలోని ‘ఎలగే పిల్ల’ అనే పాటను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలాన్, దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది. సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్‌తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement