ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Pallichattambi Movie OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Pallichattambi OTT: కాయదు మలయాళ మూవీ.. మూడు నెలలకు స్ట్రీమింగ్

Jul 15 2026 2:20 PM | Updated on Jul 15 2026 2:45 PM

Pallichattambi Movie OTT Release Date Latest Update

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే సమంత మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా మరికొన్ని సిరీస్‌లు, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమళ అండ్ కో'.. తెలుగు రివ్యూ)

లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్.. మలయాళంలో చేసిన తొలి మూవీ 'పల్లిచట్టంబి'. టొవినో థామస్ హీరో. 1957లో కేరళలో జరిగిన భూసంస్కరణ బిల్లు నేపథ్యంగా తీసిన చిత్రమిది. తెలుగులోనూ ఏప్రిల్ 15న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎక్కడా ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని మూడు నెలల తర్వాత అంటే వచ్చే శుక్రవారం (జూలై 24) నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'పల్లిచట్టంబి' విషయానికొస్తే.. 1957లో కేరళంళో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తర్వాత ఏడాది భూసంస్కరణల బిల్లు అమల్లోకి తీసుకొస్తుంది. దీంతో ఊళ్లలోని భూస్వాములు, వలసదారుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. మరోవైపు తమ చర్చిల్ని కాపాడుకునేందుకు వాటి మత పెద్దలు ప్రత్యేక రక్షక దళాల్ని తయారు చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా కణియార్‌లోని కున్నంపురం చర్చి భూముల రక్షణ కోసం పోతన్‌ క్రిస్టోఫర్‌ (టొవినో థామస్‌)ని 'చట్టంబి'గా(చర్చి రక్షకుడు లేదా రౌడీ) నియమిస్తారు.

నిజానికి పోతన్ ఓ హిందూ కుర్రాడు. అసలు పేరు కృష్ణ పిళ్లై. కానీ మారుపేరుతో ఆ చర్చిలోకి అడుగు పెట్టి, వాళ్లకి అండగా నిలుస్తాడు. కమ్యూనిస్ట్‌ భావజాలమున్న రెబెక్కా (కయాదు లోహర్‌)తో అనుకోకుండా ప్రేమలోనూ పడతాడు. తర్వాత ఏమైంది? అసలు కృష్ణ పిళ్లై గతమంటి? చర్చి భూముల రక్షణ కోసం ఎందుకు నిలబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement