breaking news
Pallichattambi Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. తెలుగులో అయితే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీనితో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే లేవు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కాస్తోకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ లాంటివి ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 20 నుంచి 26 వరకు)నెట్ఫ్లిక్స్ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 2472 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)హాట్స్టార్స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24జీ5అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లేప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్) -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే సమంత మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా మరికొన్ని సిరీస్‌లు, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమళ అండ్ కో'.. తెలుగు రివ్యూ)లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్.. మలయాళంలో చేసిన తొలి మూవీ 'పల్లిచట్టంబి'. టొవినో థామస్ హీరో. 1957లో కేరళలో జరిగిన భూసంస్కరణ బిల్లు నేపథ్యంగా తీసిన చిత్రమిది. తెలుగులోనూ ఏప్రిల్ 15న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎక్కడా ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని మూడు నెలల తర్వాత అంటే వచ్చే శుక్రవారం (జూలై 24) నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'పల్లిచట్టంబి' విషయానికొస్తే.. 1957లో కేరళంళో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తర్వాత ఏడాది భూసంస్కరణల బిల్లు అమల్లోకి తీసుకొస్తుంది. దీంతో ఊళ్లలోని భూస్వాములు, వలసదారుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. మరోవైపు తమ చర్చిల్ని కాపాడుకునేందుకు వాటి మత పెద్దలు ప్రత్యేక రక్షక దళాల్ని తయారు చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా కణియార్లోని కున్నంపురం చర్చి భూముల రక్షణ కోసం పోతన్ క్రిస్టోఫర్ (టొవినో థామస్)ని 'చట్టంబి'గా(చర్చి రక్షకుడు లేదా రౌడీ) నియమిస్తారు.నిజానికి పోతన్ ఓ హిందూ కుర్రాడు. అసలు పేరు కృష్ణ పిళ్లై. కానీ మారుపేరుతో ఆ చర్చిలోకి అడుగు పెట్టి, వాళ్లకి అండగా నిలుస్తాడు. కమ్యూనిస్ట్ భావజాలమున్న రెబెక్కా (కయాదు లోహర్)తో అనుకోకుండా ప్రేమలోనూ పడతాడు. తర్వాత ఏమైంది? అసలు కృష్ణ పిళ్లై గతమంటి? చర్చి భూముల రక్షణ కోసం ఎందుకు నిలబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
‘పళ్లిచట్టంబి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టొవినో థామస్ సినిమాలు కేరళలో బాగానే సక్సెస్ అవుతుంటాయి. తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘పళ్లిచట్టంబి’ కోసం తెలుగు ఆడియెన్స్ కోసం ఎంతో వెయిట్ చేశారు. మొత్తానికి ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 17) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ ‘పళ్లిచట్టంబి’ కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? తెలుగు వారిని ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.కథేంటంటే..ఇది పూర్తిగా కేరళ ప్రాంతానికి చెందిన కథ. అందుకే ఇందులోని పాత్రల పేర్లు, ఊరి పేర్లు కూడా అక్కడి నేటివిటికీ తగ్గట్టే ఉంటాయి. 1930లో ఈ కథ ప్రారంభం అవుతుంది. కేరళ, కర్ణాటక ప్రాంతం. అక్కడి చుట్టు పక్కల అటవీ ప్రాంతానికి కింగ్ నంబియార్. నంబియార్ గడ్డ మీద ఆంగ్లేయులు కూడా అడుగు పెట్టలేరు. 1958లో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ సమయంలో కణియార్ గ్రామంలో అల్లర్లు జరుగుతుంటాయి. అక్కడి కమ్యూనిస్టులకు, క్రిస్టియన్లకు గొడవలు జరుగుతుంటాయి. తమ చర్చిని, ప్రజల్ని కాపాడుకునేందుకు అక్కడి ఫాదర్, గ్రామస్తులు కలిసి క్రిష్టోఫర్ (రక్షకుడు), ఓ చట్టంబి (రౌడీ)ని తెచ్చుకుంటుంది. తోమాపురంకి చెందిన హిందువు కృష్ణ పిళ్లై(టొవినో థామస్)ని పోతన్ క్రిష్టోఫర్‌గా మార్చి తీసుకు వస్తారు. మరి ఆ పోతన్ వచ్చాక కణియార్ గ్రామం ఎలా మారుతుంది? కమ్యూనిస్ట్‌లను అతను ఎలా నిలువరించారు? కమ్యూనిస్ట్ పార్టీ కోసం నాటకాలు వేసే రెబెక్కా (కయాదు లోహర్) పాత్ర ఏంటి? ఆమె లక్ష్యం కోసం క్రిష్టోఫర్ ఏం చేస్తాడు? అసలు ఈ అల్లర్ల వెనుకున్నది ఎవరు? క్రూరుడైన రైలు రామన్న (శత్రు) పాత్ర ఏంటి? కణియార్ ఊరికి పక్కనే ఉండే పిశాచి కొండ వెనుకున్న రహస్యం ఏంటి? ఇక ఊరిని, చర్చిని క్రిష్టోఫర్ ఎలా కాపాడతాడు అన్నదే కథ.ఎలా ఉందంటే..‘పళ్లిచట్టంబి’ అంటే చర్చ్ రౌడీ. చర్చ్‌ని కాపాడుకునేందుకు ఒకప్పుడు కేరళలో ఈ చట్టంబిలను పెట్టుకున్నారు. ఈ కథను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని టొవినో థామస్ ఇది వరకే చెప్పాడు. అందుకే అక్కడి ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి.. అక్కడి పేర్లే కనిపిస్తుంటాయి. ప్రాంతం ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే. ఎమోషన్స్ పండితే.. ఏ భాషా చిత్రం.. ఎక్కడి చిత్రం అన్నది ఆడియెన్స్ పట్టించుకోరు. ఈ పళ్లిచట్టంబి చిత్రంలోనూ చాలా వరకు ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.ఊర్లో గొడవలు.. హీరో ఆ ఊరికి రావడం..వారికి రక్షణగా ఉంటూ.. శిక్షణ అందించడం..ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. పళ్లి చట్టంబి కథ కూడా ఇలానే సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కూడా ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకుండా సాగినట్టు కనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక ద్వితీయార్దంలో అసలు కథను రివీల్ చేస్తారు. అక్కడి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. నంబియార్ పాత్రను రివీల్ చేసిన తీరు, చూపించిన విధానం బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది.సాంకేతికంగా ఈ చిత్రం టాప్ నాచ్‌లో ఉంటుంది. ఆర్ఆర్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ప్రతీ ఫైట్, ఎమోషనల్ సీన్స్ జేక్స్ అదరగొట్టేశాడు. ఇక విజువల్స్ అయితే ఎంతో నేచురల్‌గా కనిపిస్తాయి. ఆర్ట్ వర్క్, క్యాస్టూమ్స్ ఇలా బాగుంటాయి. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే?టొవినో థామస్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతని యాక్టింగ్ కారణంగానే తెలుగులోనూ టొవినోకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. లుక్స్ పరంగానూ, యాక్షన్ పరంగానూ టొవినో అదరగొట్టేశాడు. కామెడీ, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నింట్లోనూ మెప్పించాడు. ఇక కయాదు అయితే చాలా కొత్తగా, మరింత అందంగా కనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్రతో, యాక్టింగ్‌తో భయపెట్టేస్తాడు. శత్రుకి మంచి పాత్ర లభించింది. మిగిలిన ఆర్టిస్టులు మలయాళీలే కావడంతో మన తెలుగు ఆడియెన్స్ ఎక్కువ కనెక్ట్ కాలేకపోవచ్చు.కేరళ ప్రాంతానికి సంబంధించిన కథ కావడం, తెలుగు నేటివిటికీ దూరంగా ఉండటం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అక్కడి ప్రజలకు నచ్చినంతగా ఈ చిత్రం ఇక్కడి వారికి నచ్చకపోవచ్చు. అలా అని ‘పళ్లిచట్టంబి’ ప్రయత్నం అయితే వృథాగా పోదు. టెక్నికల్లీ బ్రిల్లియంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. -
పళ్లి చట్టంబి రిలీజ్ వాయిదా.. కారణమదే..!
మలయాళ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం పళ్లి చట్టంబి. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ రోజే సినిమా విడుదల కావాల్సి ఉంది.మలయాళంలో మాత్రం ఈ రోజే విడుదల చేసిన మేకర్స్.. తెలుగు విడుదల వాయిదా వేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రానుంది. సాంకేతిక సమస్యస కారణంగానే ఈ మూవీ తెలుగు రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్ని వాస్ వర్క్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ కీలకపాత్రలు పోషించారు. 1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
ఊరు మాత్రమే కదా మారుతోంది!
‘తను భూమిపై తిరిగి హక్కును దక్కించుకోవడానికి వస్తాడు సార్.. ఈ గడ్డ నరనరాన్ని అతడు తెంచేస్తాడు..ఆ నేల అసలైన యజమాని’ అనే డైలాగులతో ‘పళ్లిచట్టంబి’ ట్రైలర్ ఆరంభం అయింది. టొవినో థామస్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏంటి మై డియర్ రౌడీగారు కొంచెం నవ్వొచ్చుగా’, ‘నువ్వు భలేరౌడీవే.. మా ఊరి వాళ్లందర్నీ బాగానే మాయ చేసేశావ్(కయాదు లోహర్)’, ‘ఊరు మాత్రమే కదా మారుతోంది.. మట్టి, మనుషులు అందరికీ ఒక్కటే కదా’ అంటూ టొవినో థామస్ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్. -
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదు: టొవినో థామస్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్ మీడియాతో ముచ్చటించారు.హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. డిజో పళ్లిచట్టంబి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నేను కమిట్ మూవీస్ ఫినిష్ చేశాను. డిజో కూడా జనగణమన సినిమాతో పాటు మరో మూవీ రూపొందించాడు. ఆ తర్వాత ఈ సినిమా వర్క్స్ ప్రారంభించాం. కొద్ది రోజుల తర్వాత ప్రొడ్యూసర్ మారారు. మేము వేరే ప్రొడ్యూసర్స్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాం. ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్ ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను. అప్పటిదాకా డైటింగ్ చేసే నేను ఈ చిత్రం కోసం డైటింగ్ పక్కనపెట్టాను. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారాను. డిజోతో వర్క్ చేయడంలో ఎలాంటి ప్రెజర్ ఉండదు. సెట్ లో కూల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు కోపం వస్తుందా అనేది కూడా తెలియదు. పళ్లిచట్టంబి సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్ గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. అంతేకానీ ఆ పరిస్థితుల నేపథ్యాన్ని మా అభిప్రాయ కోణంలో చూపించలేదు. మీరు ఒక్కసారి సినిమా చూస్తే మూవీ సోల్ అర్థమవుతుంది. మా మూవీలో మానవత్వం ముఖ్యమనే పాయింట్ ను చూపిస్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయంలో కూడా మనమంతా ఒక్కటే. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్ కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాను. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారు. నేను తెలుగులో సినిమా చేయకున్నా తెలుగు ప్రేక్షకులు నా మలయాళ మూవీస్ చూసి ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు.హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ ... ఈ చిత్రంలో రెబెకా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర ఇంటెలెక్చువల్, రూటెట్ గా ఉంటుంది. గ్లామర్ అనే కోణంలో ప్రేక్షకులు నా పాత్రను చూడరు. మూవీలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కోసం నేను బాగా కష్టపడాలి అనుకున్నా. ఈ సినిమా నన్ను నాయికగా మరింత మంచి పొజిషన్ కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. నేను బయటకు మోడరన్ అమ్మాయిలా కనిపిస్తా కానీ రూరల్ అమ్మాయి మనస్తత్వమే నాలో ఉంటుంది. డైరెక్టర్ డిజో సపోర్ట్ తో రెబెకా పాత్రను సంతృప్తికరంగా పోషించగలిగాను’అన్నారు. -
'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
మనుషులు సైతాన్ ఎదురెదురుగా ఉండే ప్రదేశమిది.. టీజర్ రిలీజ్
'2018' అనే డబ్బింగ్ సినిమాతో పాటు పలు ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో పరిచయమున్న టొవిన్ థామస్.. ఇప్పుడు 'పల్లిచట్టంబి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 10న దక్షిణాది భాషల్లో ఇది రిలీజ్ కానుంది. లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్. తాజాగా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)ఓ ఊరిలో జరిగి అంతర్గత సమస్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. ఒకటి రెండు తెలిసిన ముఖాలు ఉన్నప్పటికీ.. టైటిల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు ప్రతిదీ తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. దానికి తోడు అదే తేదీన 'డకాయిట్' మూవీ రిలీజ్ కానుంది. చూడాలి మరి 'పల్లిచట్టంబి' ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)


