మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.


