మనుషులు సైతాన్ ఎదురెదురుగా ఉండే ప్రదేశమిది.. టీజర్ రిలీజ్ | Tovino Thomas Pallichattambi Movie Teaser, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Pallichattambi Teaser: టొవినో-కాదయ్ 'పల్లిచట్టంబి' తెలుగు టీజర్

Mar 23 2026 11:55 AM | Updated on Mar 23 2026 12:19 PM

Tovino Thomas Pallichattambi Movie Teaser

'2018' అనే డబ్బింగ్ సినిమాతో పాటు పలు ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో పరిచయమున్న టొవిన్ థామస్.. ఇప్పుడు 'పల్లిచట్టంబి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 10న దక్షిణాది భాషల్లో ఇది రిలీజ్ కానుంది. లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్. తాజాగా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

ఓ ఊరిలో జరిగి అంతర్గత సమస్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. ఒకటి రెండు తెలిసిన ముఖాలు ఉ‍న్నప్పటికీ.. టైటిల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు ప్రతిదీ తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. దానికి తోడు అదే తేదీన 'డకాయిట్' మూవీ రిలీజ్ కానుంది. చూడాలి మరి 'పల్లిచట్టంబి' ఏం చేస్తుందో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement