పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా? | Harish Shankar Another Movie With Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: ఒకటి అలా.. మరొకటి ఇలా.. ఈసారి ఏమవుతుందో?

Mar 22 2026 4:07 PM | Updated on Mar 22 2026 4:49 PM

Harish Shankar Another Movie With Pawan Kalyan

గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్‌తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ఆడియెన్స్‌కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.

(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)

ఇప్పుడు పవన్‌తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.

హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement