'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది! | Mrunal Thakur Item Song For Peddi Movie | Sakshi
Sakshi News home page

Peddi Movie: ముందు అనుకున్నారు.. ఫైనల్‌గా ఫిక్స్ చేశారా?

Mar 22 2026 3:28 PM | Updated on Mar 22 2026 3:28 PM

Mrunal Thakur Item Song For Peddi Movie

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'పెద్ది'.. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ నడుస్తుండటంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించడంతో వాయిదా లాంటిది లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారా అనే ప్రశ్న కూడా ఇంకా అలానే మిగిలిపోయింది. ఫైనల్‌గా దానికి సమాధానం దొరికేసినట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)

గతంలో 'పెద్ది' ఐటమ్ కోసం పూజా హెగ్డే, ఆయేషా ఖాన్, మృణాల్ ఠాకుర్.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండేసరికి ఎవరిని తీసుకున్నారనే విషయం బయటకు రాలేదు. చివరకు ఇప్పుడు ముందు అనుకున్న వాళ్లలో మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈమె హీరోయిన్‌గా చేసిన 'డకాయిట్' రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు ప్లస్ 'పెద్ది' సాంగ్ చేసేందుకుగానూ రాబోయే కొన్నిరోజులు ఈమె హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఐటమ్ పాటలో చరణ్-మృణాల్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా కాసేపు కనిపిస్తుందని అంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా రెండూ సూపర్ హిట్ అయ్యాయి. 

(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement