ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు కాస్త స్పెషల్ | Here's The List Of 19 New Movies And Web Series Releasing In OTT In March 2026 Last Week | Sakshi
Sakshi News home page

OTT Movie Releases This Week: ఓటీటీల్లో 19 మూవీస్ రిలీజ్.. మరి థియేటర్లలో?

Mar 23 2026 10:25 AM | Updated on Mar 23 2026 10:37 AM

Upcoming OTT Movies Telugu March Last Week 2026

మరోవారం వచ్చేసింది. గతవారం రిలీజైన 'ధురంధర్ 2' జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇకపోతే ఈ వారం 'కోర్ట్' జంట నటించిన 'బ్యాండ్ మేళం', ప్రియదర్శి 'సుయోధన'తో పాటు తమిళ డబ్బింగులైన 'యూత్', 'హ్యాపీరాజ్' మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. వీటితో పాటు ఓటీటీల్లోనూ చాలా తక్కువగా మాత్రమే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్, రాణిముఖర్జీ 'మర్దానీ 3' సినిమా మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ గానీ సిరీస్‌లు గానీ ఏం లేవు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 23 నుంచి 29 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఇన్‌సైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - మార్చి 23

  • హార్ట్ బ్రేక్ హై సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25

  • హోమీసైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25

  • సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టూ హ్యాపెన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 26

  • ద రెడ్ లైన్ (థాయ్ సినిమా) - మార్చి 26

  • డిటెక్టివ్ హోల్ (నార్వేజియన్ సిరీస్) - మార్చి 26

  • మర్దానీ 3 (హిందీ మూవీ) - మార్చి 27

హాట్‌స్టార్

  • ద కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 23

  • ద హన్నా మొంటానా 20th యానివర్సరీ స్పెషల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24

  • డేర్ డెవిల్ బార్న్ ఎగైన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25

  • కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27

అమెజాన్ ప్రైమ్

  • బెయిట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25

  • ప్రెటీ లేథల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 25

  • ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27 

  • హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27

జీ5

  • భానుప్రియ భూటర్ హోటల్ (బెంగాలీ చిత్రం) - మార్చి 26

  • ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27

  • హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27

ఆపిల్ టీవీ

  • ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27

(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement