పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు! | yash Toxic Movie Escape With Dhurandhar 2 And Ustaad Bhagat Singh Caught | Sakshi
Sakshi News home page

Yash Pawan Kalyan: మూవీ లవర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్!

Mar 22 2026 9:12 PM | Updated on Mar 22 2026 9:12 PM

yash Toxic Movie Escape With Dhurandhar 2 And Ustaad Bhagat Singh Caught

కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.

(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)

గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.

కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

Advertisement
 
Advertisement
Advertisement