ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్ | Actor Rajasekhar Requestd Director Cast Him In Movies | Sakshi
Sakshi News home page

Rajasekhar: సెకండ్ హీరోలానే నన్ను ట్రీట్ చేశారు

Mar 22 2026 8:40 PM | Updated on Mar 22 2026 8:40 PM

Actor Rajasekhar Requestd Director Cast Him In Movies

అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని ఏ దర్శకులు కూడా తీసుకోవట్లేదు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటించిన సినిమా 'బైకర్'. శర్వానంద్ హీరో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే రాజశేఖర్.. తనకు అవకాశాలు ఇవ్వాలని బతిమలాడుకున్నారు.

(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)

ఒకప్పుడు హీరోగా హిట్స్ కొట్టిన చాలామంది ఇప్పుడు తెరమరుగైపోయారు. మధ్యలో విలన్, సహాయ పాత్రలతో జగపతిబాబు లాంటి వాళ్లు వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే బలంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ 'బైకర్'లో హీరో తండ్రిగా, రేసింగ్ కోచ్‌గా మంచి నిడివి ఉన్న పాత్రనే చేసినట్లున్నారు. అయితే తనని ఏ దర్శకుడు కూడా సంప్రదించకపోయేసరికి.. స్వయంగా ఈయనే 'ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి' అని రిక్వెస్ట్ చేశారు.

సెకండ్ స్టేజీకి వచ్చేశానని ఇన్నాళ్లు అనుకున్నానని.. కానీ అలాంటివేం ఇ‍ప్పుడు లేవని తన కూతుళ్లు చెప్పడంతోనే 'బైకర్'లో నటించానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్‌లో తనని రెండో హీరోలా ట్రీట్ చేశారని, శర్వానంద్ కూడా నేనే హీరోని అన్నట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజశేఖర్ లాంటి నటుడు.. ఇలా అవకాశాల కోసం బతిమలాడుకోవడం వింతగా అనిపించింది. రీసెంట్ టైంలో అయితే గోటీల ఫ్యాక్టరీ అనే మాటతో తెగ వైరల్ అవుతున్నారు.

(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement