శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది | Sharwanand Biker Movie Trailer | Sakshi
Sakshi News home page

Biker Trailer: బైక్ రేసింగ్‌పై సినిమా… ట్రైలర్ చూశారా?

Mar 22 2026 6:23 PM | Updated on Mar 22 2026 6:23 PM

Sharwanand Biker Movie Trailer

శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బైకర్'. ఒకప్పటి హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజవ్వాలి. కానీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందులోనూ బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇందులో శర్వానంద్, రాజశేఖర్.. తండ్రికొడుకులు పాత్రలు చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉన్నాయి. మరి మూవీ ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?)

Advertisement
 
Advertisement
Advertisement