మలయాళ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం పళ్లి చట్టంబి. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ రోజే సినిమా విడుదల కావాల్సి ఉంది.
మలయాళంలో మాత్రం ఈ రోజే విడుదల చేసిన మేకర్స్.. తెలుగు విడుదల వాయిదా వేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రానుంది. సాంకేతిక సమస్యస కారణంగానే ఈ మూవీ తెలుగు రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్ని వాస్ వర్క్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు.
కాగా.. ఈ చిత్రంలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ కీలకపాత్రలు పోషించారు. 1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.


