అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదు: టొవినో థామస్ | Tovino THomas And Kayadu Lohar Talk About Pallichattambi Movie | Sakshi
Sakshi News home page

అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదు: మలయాళ స్టార్‌టొవినో థామస్

Apr 1 2026 7:07 PM | Updated on Apr 1 2026 7:32 PM

Tovino THomas And Kayadu Lohar Talk About Pallichattambi Movie

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై  నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్ మీడియాతో ముచ్చటించారు.

హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. డిజో పళ్లిచట్టంబి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నేను కమిట్ మూవీస్ ఫినిష్ చేశాను. డిజో కూడా జనగణమన సినిమాతో పాటు మరో మూవీ రూపొందించాడు. ఆ తర్వాత ఈ సినిమా వర్క్స్ ప్రారంభించాం. కొద్ది రోజుల తర్వాత ప్రొడ్యూసర్ మారారు. మేము వేరే ప్రొడ్యూసర్స్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాం. ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్ ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను. అప్పటిదాకా డైటింగ్ చేసే నేను ఈ చిత్రం కోసం డైటింగ్ పక్కనపెట్టాను. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారాను. డిజోతో వర్క్ చేయడంలో ఎలాంటి ప్రెజర్ ఉండదు. సెట్ లో కూల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు కోపం వస్తుందా అనేది కూడా తెలియదు. 

పళ్లిచట్టంబి సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్ గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. అంతేకానీ ఆ పరిస్థితుల నేపథ్యాన్ని మా అభిప్రాయ కోణంలో చూపించలేదు. మీరు ఒక్కసారి సినిమా చూస్తే మూవీ సోల్ అర్థమవుతుంది. మా మూవీలో మానవత్వం ముఖ్యమనే పాయింట్ ను చూపిస్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయంలో కూడా మనమంతా ఒక్కటే. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. 

తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్ కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాను. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారు. నేను తెలుగులో సినిమా చేయకున్నా తెలుగు ప్రేక్షకులు నా మలయాళ మూవీస్ చూసి ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు.

హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ  ... ఈ చిత్రంలో రెబెకా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర ఇంటెలెక్చువల్, రూటెట్ గా ఉంటుంది. గ్లామర్ అనే కోణంలో ప్రేక్షకులు నా పాత్రను చూడరు. మూవీలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కోసం నేను బాగా కష్టపడాలి అనుకున్నా. ఈ సినిమా నన్ను నాయికగా మరింత మంచి పొజిషన్ కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. నేను బయటకు మోడరన్ అమ్మాయిలా కనిపిస్తా కానీ రూరల్ అమ్మాయి మనస్తత్వమే నాలో ఉంటుంది. డైరెక్టర్ డిజో సపోర్ట్ తో రెబెకా పాత్రను సంతృప్తికరంగా పోషించగలిగాను’అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement