ఊరు మాత్రమే కదా మారుతోంది! | Tovino Thomas Pallichattambi trailer released | Sakshi
Sakshi News home page

ఊరు మాత్రమే కదా మారుతోంది!

Apr 7 2026 12:09 AM | Updated on Apr 7 2026 12:09 AM

Tovino Thomas Pallichattambi trailer released

‘తను భూమిపై తిరిగి హక్కును దక్కించుకోవడానికి వస్తాడు సార్‌.. ఈ గడ్డ నరనరాన్ని అతడు తెంచేస్తాడు..ఆ నేల అసలైన యజమాని’ అనే డైలాగులతో ‘పళ్లిచట్టంబి’ ట్రైలర్‌ ఆరంభం అయింది. టొవినో థామస్‌ హీరోగా, కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వంలో వరల్డ్‌ వైడ్‌ ఫిలింస్, సి క్యూబ్‌ బ్రోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్‌ నిర్మించారు.

ఈ సినిమా ఏప్రిల్‌ 10న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘ఏంటి మై డియర్‌ రౌడీగారు కొంచెం నవ్వొచ్చుగా’, ‘నువ్వు భలేరౌడీవే.. మా ఊరి వాళ్లందర్నీ బాగానే మాయ చేసేశావ్‌(కయాదు లోహర్‌)’, ‘ఊరు మాత్రమే కదా మారుతోంది.. మట్టి, మనుషులు అందరికీ ఒక్కటే కదా’ అంటూ టొవినో థామస్‌ చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: టిజో టోమీ, సంగీతం:  జేక్స్‌ బిజోయ్‌.

Advertisement
 
Advertisement
Advertisement