మృణాల్.. టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్? | Mrunal Thakur Dating Rumours With Crickter Rishabh Pant | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: మొన్న ధనుష్.. ఇప్పుడు భారత క్రికెటర్‌తో రూమర్స్?

Jul 15 2026 12:58 PM | Updated on Jul 15 2026 1:06 PM

Mrunal Thakur Dating Rumours With Crickter Rishabh Pant

తెలుగులో మూడు నాలుగు సినిమాలే చేసినప్పటికీ హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ని ఇక్కడి ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ బాగానే ఓన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఏదోలా మృణాల్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం హీరో ధనుష్‌తో డేటింగ్, పెళ్లి అని తెగ మాట్లాడుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ పంత్‌తో డేటింగ్‌లో ఉందంటున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు.

(ఇదీ చదవండి: మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక)

మృణాల్ ప్రస్తుతం హిందీలో వరసగా సినిమాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితం హీరో ధనుష్‌తో ఈమె రిలేషన్‌లో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ వీటిని మృణాల్ కొట్టిపారేసింది. రీసెంట్‌గా రిషభ్ పంత్, ఈమె ఒకరినొకరు ఇన్ స్టాలో ఫాలో చేసుకోవడంతో వీళ్లిద్దరూ ఏమైనా డేటింగ్ చేస్తున్నారా అని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది.

అయితే పంత్ గురించి ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేం కాదు. చాన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటి ఊ‍ర్వశి రౌతేలాతో రిలేషన్ అంటూ పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హడావుడి తప్పితే నిజంగా అలాంటిదేమైనా ఉందా? లేదా అనేది మృణాల్, పంత్ చెప్పాలి. అప్పటివరకు ఈ గోల తప్పదు.

(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement