సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై హైకోర్టులో విచారణ | Delhi High Court to Hear Plea on Sonam Wangchuks Hospitalization | Sakshi
Sakshi News home page

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై హైకోర్టులో విచారణ

Jul 15 2026 11:00 AM | Updated on Jul 15 2026 11:26 AM

Delhi High Court to Hear Plea on Sonam Wangchuks Hospitalization

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆయనను ఆస్పత్రికి తరలించాలని, బలవంతంగానైనా పోషకాహారం అందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.

న్యాయవాది రాకేష్ కుమార్ సైనీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాంగ్‌చుక్ కండరాల క్షీణతతో తీవ్రమైన బాధలో ఉన్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనకు తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, ద్రవ రూపంలో పోషకాలను అందించాలని కోర్టును కోరారు. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించనుంది.

మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు దీక్ష విరమించాలని వాంగ్‌చుక్‌ను కోరారు. ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద  నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి వాంగ్‌చుక్‌ మద్దతు ప్రకటిస్తూ, దీక్షకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement