కర్ణాటక: ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన వెజిటేరియన్ బర్గర్‌కు బదులుగా మాంసాహార బర్గర్‌ను అందించినందుకు, శివమొగ్గ జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్, ఆహార పంపిణీ సంస్థ జొమాటోకు, సదరు హోటల్ యజమానికి జరిమానా విధించింది. వివరాలు.. శివమొగ్గలోని జె.పి. ఎన్ రోడ్‌కు చెందిన నందీష్, గతేడాది గణేష్ చతుర్థి పండుగ రోజున జొమాటో ద్వారా వెజ్ బర్గర్‌ను ఆర్డర్‌చేశాడు. ఇందుకు రూ. 313 చెల్లించాడు.
కానీ డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్‌లో మాంసాహార బర్గర్ ఉంది. నందీష్ ఫిర్యాదు చేయగా యాప్‌లో డబ్బులు వెనక్కి వచ్చాయి. కానీ పవిత్రమైన రోజున తన ఇంటికి మాంసం రావడంతో భక్తిభావం దెబ్బతిందని, పరిహారం చెల్లించాలని కేసు వేశాడు. విచారించిన కమిషన్.. బెంగళూరులోని జొమాటో జోనల్ హెడ్‌కు, శివమొగ్గలోని హోటల్‌కు నోటీసులు ఇచ్చింది. రూ.10 వేల పరిహారం, మరో రూ.10 వేలు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. కమిషన్ ఛైర్మన్ టి. శివన్న, సభ్యుడు బి.డి. యోగానంద భండ్యా విచారించారు.


