గిగ్‌ వర్కర్లకు 5 విశ్రాంతి కేంద్రాలు | Five Rest Centers For Gig Workers In Hyderabad | Sakshi
Sakshi News home page

గిగ్‌ వర్కర్లకు 5 విశ్రాంతి కేంద్రాలు

Jul 14 2026 9:12 AM | Updated on Jul 14 2026 9:12 AM

Five Rest Centers For Gig Workers In Hyderabad

కొండాపూర్, తెల్లాపూర్, పటాన్‌చెరు, భారతీనగర్, చందానగర్‌లో ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: గిగ్‌ వర్కర్ల కోసం ‘ప్రాజెక్ట్‌ ఆశ్రయ్‌’ కింద సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) శేరిలింగంపల్లి జోన్, అమెజాన్‌ ఇండియా సంయుక్తంగా కొండాపూర్, తెల్లాపూర్, పటా¯Œన్‌చెరు, భారతీనగర్, చందానగర్‌లలో ‘రెస్ట్‌ స్టాప్‌ పోర్టా క్యాబిన్స్‌’ ఏర్పాటు చేయనున్నాయి.

ఇందుకు సంబంధించి సోమవారం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్, సీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.  అమెజాన్‌ ఇండియా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఈ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ చేపట్టనుంది.

అన్ని సంస్థలకు చెందిన గిగ్‌ వర్కర్లు ఈ సదుపాయాలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. పని సమయంలో విశ్రాంతి తీసుకుని పునరుత్తేజం కావడానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో గిగ్‌ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి సురక్షితమైన విశ్రాంతి సదుపాయాలను కలి్పంచేందుకు ‘ప్రాజెక్ట్‌ ఆశ్రయ్‌‘ ఉపయోగపడుతుందని సృజన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement