ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో! | Zomato Hikes Food Delivery Platform Fee Know The Details Here | Sakshi
Sakshi News home page

ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో!

Mar 20 2026 4:31 PM | Updated on Mar 20 2026 6:00 PM

Zomato Hikes Food Delivery Platform Fee Know The Details Here

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. ఒక్కో ఆర్డర్‌కు ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.

చివరిసారిగా ప్లాట్‌ఫామ్ పీజుల పెంపును కంపెనీ సెప్టెంబర్ 2025లో చేపట్టింది. జొమాటో ఫుడ్ డెలివరీకి.. పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్‌కు 14.99 రూపాయలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది

ఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త పోటీదారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో, ఇటీవల బెంగళూరులో 'ఓన్లీ' అనే తన ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. డెలివరీ ఫీజు మినహా, కస్టమర్ల నుంచి గానీ, రెస్టారెంట్ల నుండి గానీ ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయబోమని ఆ కంపెనీ తెలిపింది.

ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లపై కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో రాపిడో తీసుకున్న ఈ చర్య ఇప్పటికే ఉన్న సంస్థలపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాగా.. ప్లాట్‌ఫామ్ ఫీజుల పెంపుకు సంబంధించిన ప్రకటన తరువాత.. ఎటర్నల్ షేర్లు దాదాపు 2% పెరిగి ఒక్కో షేరు రూ. 233 వద్ద ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement