కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ టెస్ట్.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ కమిషనర్, సజ్జనార్‌ | GHMC Commissioner And Hyderabad Police Chief Review KBR Park Traffic Amid One Way Trial, More Details Inside | Sakshi
Sakshi News home page

కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ టెస్ట్.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ కమిషనర్, సజ్జనార్‌

Jul 15 2026 9:20 AM | Updated on Jul 15 2026 10:18 AM

GHMC Commissioner And Sajjanar Review At KBR Park Traffic

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. హెచ్‌-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన వన్‌వే ట్రయల్ రన్‌లో గుర్తించిన సమస్యలను పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ మార్నింగ్ వాక్ చేస్తూ ట్రాఫిక్ రాకపోకలను పరిశీలించిన అధికారులు.. వన్‌వే విధానం అమలుతో ఎదురవుతున్న ఇబ్బందులు, వాహనాల రద్దీ, రోడ్ల నిర్వహణ, ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన మార్పులు, మెరుగైన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా హెచ్‌-సిటీ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపడుతున్న ట్రాఫిక్ మార్పులపై ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement