తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే గోల్కొండ బోనాలకు వేళయ్యింది. గురువారం శ్రీజగదాంబిక మహంకాళికి తొలిబోనాన్ని భక్తులు సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
అమ్మవారి ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో అలకరించారు. భక్తులకు వసతులు కల్పించేందుకు టెంట్లు వేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.




