హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగతంగా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇంతకుముందు ఓ హీరోని ప్రేమించిన వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తర్వాత కొన్నాళ్లకు సొహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. కొన్నాళ్ల క్రితం హన్సిక తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకుంది. తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టి గుళ్లు, గోపురాలు తిరిగింది. విదేశాలు చుట్టొస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇలా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
(ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా)
ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వస్తున్న విమర్శలు, వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలోని రూమర్స్ గురించి హన్సిక ఘాటుగా స్పందించింది. 'సాధారణంగా సెలబ్రిటీస్ అనగానే వారి వ్యక్తిగత విషయాల గురించి ఎవరైనా విమర్శించొచ్చు అనే భావన పలువురిలో ఉంటుంది. ప్రముఖులకు మనసు అనేది ఒకటి ఉంటుందని అలాంటి వారు గ్రహించాలి. జీవితంలో కష్టకాలాన్ని అధిగమించే సమయంలో వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. జరిగిన విషయాలను ఎవరు మార్చలేరు. ఇకపై సాగే జీవితం ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గత కాలాన్ని తలుచుకుంటూ కూర్చోవడం పూలిష్‌నెస్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎదగడమే ముఖ్యం' అని హన్సిక చెప్పుకొచ్చింది.
ఇకపోతే హీరోయిన్‌గా 50 సినిమాలు చేసిన హన్సిక.. నిర్మాతగా మారి ఓ మూవీ తీసింది. కానీ భారీ నష్టాలతో చేతులు కాల్చుకుంది. మళ్లీ ఈ అమ్మడిని తెరపై ఎప్పుడు చూస్తామో ఏంటో?
(ఇదీ చదవండి: శరత్‌ని లాగి చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక)


