ముద్రగడ పద్మనాభం మృతిపై చిరంజీవి సంతాపం | Chiranjeevi Pays Heartfelt Tribute To Former Minister Mudragada Padmanabham Demise, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

Mudragada-Chiranjeevi: ముద్రగడ ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం

Jul 15 2026 9:37 AM | Updated on Jul 15 2026 10:25 AM

Chiranjeevi Condolence Mudragada Padmanabham Demise

కాపు ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..  హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ముద్రగడ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ట్వీట్ చేశారు. 'మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. శ్రీ ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.ఓం శాంతి' అని చిరంజీవి రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement