సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ? | Cm VIjay Jason Sanjay Debut As Hero New Movie | Sakshi
Sakshi News home page

Jason Sanjay: డైరెక్షన్ అయిపోయింది.. ఇప్పుడు హీరోగా!

Jul 15 2026 8:22 AM | Updated on Jul 15 2026 8:22 AM

Cm VIjay Jason Sanjay Debut As Hero New Movie

హీరోగా స్టార్‌డమ్ అనుభవించిన విజయ్‌.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్‌ సంజయ్‌ లండన్‌లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్‌ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)

ఈ సినిమాలోనే జేసన్‌ సంజయ్‌ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్‌.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇ‍ప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్‌ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్‌ కుమరన్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement