సినిమా ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అది ఒక అట్రాక్షన్. ఎలాంటి చిత్రానికైన బీజం ప్రేమే. ఆ ప్రేమలో అనేక అంశాలు దాగి ఉంటాయి. అందులో అందాలు ఆరబోసే గ్లామర్ ఉంటుంది. బికినీ అందాలతో కవ్వించే సీన్స్ ఉంటాయి. నయనతార, అనుష్క లాంటి టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోయిన్ల వరకు తమ అందాలను బికినీ దుస్తుల్లో ఆరబోస్తుంటారు. తద్వారా పాపులర్ అవుతుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం తాను బికినీ దుస్తులకు పూర్తి వ్యతిరేకిని అని చెప్పింది.
(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)
నిజం చెప్పాలంటే కాజల్ కూడా గ్లామరస్ నటనతోనే స్టార్ హీరోయిన్ అయింది. తెలుగు ,తమిళ, హిందీ తదితర భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పెళ్లి తర్వాత నటనకు చిన్న బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత కొన్నేళ్లుగా మళ్లీ సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన 'ది ఇండియా స్టోరీ' అనే పాన్ ఇండియా చిత్ర విడుదలకు సిద్ధమైంది. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు బికినీ దుస్తుల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది.
అంతేకాదు సినిమాల్లో హద్దులు మీరిన రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించనని కాజల్ చెప్పుకొచ్చింది. తనకు తాను కొన్ని హద్దులు విధించుకున్నానని పేర్కొంది. కాదు కూడదు అంటే అలాంటి చిత్రాల్లో నటించలేనని స్పష్టంగా చెప్పింది. అది ఎంత భారీ బడ్జెట్ చిత్రం అయినా, ఎంత ముఖ్యమైన పాత్ర అయినా తనకు చింత లేదని స్పష్టం చేసింది. నటన విషయంలో తనకంటూ ఒక పరిమితిని పెట్టుకున్నట్లు , దాన్ని తాను కచ్చితంగా పాటిస్తానని నటి కాజల్ పేర్కొంది.
(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో సింగర్ పెళ్లి.. తనకంటే భార్య 16 ఏళ్లు చిన్నది)


