ఆకట్టుకుంటున్న రొమాంటికి సాంగ్‌ ‘మనసా మనసా’ | Director VV Vinayak launches the song Manasa Manasa from Ade Neevu Ade Nenu | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న రొమాంటికి సాంగ్‌ ‘మనసా మనసా’

Jul 14 2026 3:00 AM | Updated on Jul 14 2026 12:18 PM

Director VV Vinayak launches the song Manasa Manasa from Ade Neevu Ade Nenu

కొండల్, వీవీ వినాయక్, గోవిందు

‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్‌ త్రినాథ్‌ వర్మ, యశ్వంత్‌ పెండ్యాల, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ సినిమా ఫేమ్‌ తన్వీ నేగి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. 

కనిష్క సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘మనసా మనసా...’ అంటూ సాగే పాటని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘మనసా మనసా...’ సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా  హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.   ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్‌ రాయగా, జావెద్‌ అలీ పాడగా, వేద కొరియోగ్రఫీ అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement