తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్‌గా తెగ వైరలైన బ్రిగిడా సాగా.. ఇటీవలే తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్‌స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా.. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు.


