లెనిన్‌తో అఖిల్‌ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..! | Copy Trolls On Akkineni Akhil Lenin Movie from tollywood movie | Sakshi
Sakshi News home page

Lenin Movie: లెనిన్ హిట్.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్..!

Jul 13 2026 7:43 PM | Updated on Jul 13 2026 8:16 PM

Copy Trolls On Akkineni Akhil Lenin Movie from tollywood movie

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన అఖిల్ సక్సెస్ కొట్టేశాడు.

లెనిన్‌పై కాపీ ట్రోల్స్..

లెనిన్ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తోన్న మేకర్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. లెనిన్ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కాపీ చేశారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. లెనిన్‌లో హైలెట్‌గా నిలిచిన క్లైమాక్స్‌ సీన్‌ను మక్కీకి మక్కీ దించేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది. 1999లో బాలయ్య నటించిన క్రిష్ణబాబు మూవీలోని సీన్‌ను తలపిస్తోందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్  విమర్శలు చేస్తున్నారు. 

సేమ్ టూ సేమ్.. 

1999లో వచ్చిన క్రిష్ణబాబు మూవీలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి.. ఆమె అరవకుండా చేసి.. హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి హీరోయిన్‌ను చంపేలా చేస్తాడు. అచ్చం అలానే ఈ చిత్రంలో విలన్ హీరో కళ్లల్లో కెమికల్ కొట్టడం.. హీరోయిన్ నోట్లో గుడ్డలు కుక్కడం.. చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్‌ను దించేశారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో ఈ తరం ప్రేక్షకులకు తగినట్లుగా సీన్ రీ క్రియేట్ చేశారని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై లెనిన్ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

కాగా.. నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి  నటించిన చిత్రం క్రిష్ణబాబు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజై ఓ మాదిరి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సీన్‌నే.. లెనిన్ టీమ్ కాపీ చేశారని అంటున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement