breaking news
Lenin Movie
-
లెనిన్ జోడీ నెక్స్ట్ ఏంటి? అసలు ఏం జరగబోతోంది?
-
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫ్రైడే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా మహేశ్ బాబు దూకుడు చిత్రం(ఆగస్టు 09) రీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే అక్కినేని హీరో అఖిల్ మూవీ లెనిన్ సందడి చేయనుంది. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, మలయాళ చిత్రం హృదయం మురళి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ శుక్రవారమే ఓటీటీకి రానున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07 ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07 మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07 రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07 అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07 డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07బిగ్చికెన్.. ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పరసీ(హాలీవుడ్)- ఆగస్టు 07 లవ్ హర్ట్స్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 07 ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08జీ5 లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07 వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ ఓ సుకుమారి(తెలుగు సినిమా)- ఆగస్టు 07 వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07జియో హాట్‌స్టార్ ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్ పొంగళ (మలయాళ మూవీ) - ఆగస్టు 07సన్ నెక్ట్స్..సత్యతిల్ సంబవిచతు(మలయాళ మూవీ)- ఆగస్టు 07 -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు రీ రిలీజ్ (ఆగస్టు 09) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ చాలానే క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. జాబితాలో దాదాపు 23 వరకు మూవీస్, సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్స్ ఉన్నాయి. వీటికి తోడు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 03 నుంచి 09 వరకు)జీ5లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 04 (రెంట్)స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07నెట్ఫ్లిక్స్బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04బిగ్ చికెన్: ఏ ఫాస్ట్‌ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05ఇన్సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08హాట్స్టార్ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 04ద షార్డ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 07ఆపిల్ టీవీ ప్లస్టెడ్ లాసో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
'లెనిన్'లో లేని క్రేజీ సాంగ్ వీడియో రిలీజ్
అఖిల్‌కి 'లెనిన్'తో తొలి సక్సెస్ దక్కింది. గత నెలలో రిలీజైన ఈ మూవీకి రూ.100 కోట్ల వసూళ్లు వచ్చాయి. వచ్చే శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కి కూడా రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్‌కి ముందు 'సోల్ ఆఫ్ లెనిన్' పేరిట ఓ సాంగ్‌ని బయటకు వదిలారు. ఇది మూవీలో కూడా ఉంటుందేమోనని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. దీనిని ఎడిటింగ్‌లో తీసేశారు. కానీ ఇప్పుడు పూర్తి వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు.(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని ఈ మూవీ తీశారు. ఫస్టాప్ రొటీన్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో వరసపెట్టి ట్విస్టులు వస్తూనే ఉంటాయి.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ) -
ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన
అక్కినేని హీరో అఖిల్ కెరీర్లో అందుకున్న తొలి సక్సెస్ 'లెనిన్'. గత నెలలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. ఇకపోతే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఎందులోకి రానుంది?అఖిల్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన రూరల్ యాక్షన్ సినిమా 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు కాగా నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న థియేటర్లలో రిలీజైంది. బాగానే అలరించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 7వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.'లెనిన్' విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు.ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి దీని తర్వాత ఏమైంది? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.The roar begins. 🔥A story of love, revenge, and revolution is all set to take over your screens.#Lenin premieres on August 7, exclusively on Telugu ZEE5.#BlockbusterLENIN@akkineniakhil @BhagyashriBose @nagavamsi19 @KishoreAbburu @MusicThaman pic.twitter.com/erTH7OLf5W— ZEE5 Telugu (@ZEE5Telugu) August 1, 2026 -
అక్కినేని ఫ్యామిలీకి అదృష్టం ఈ ఏడాది పెద్ద సినిమాలు ఇవే!
-
అమ్మ నా వాట్సాప్‌ను బ్లాక్ చేసింది..!: భాగ్యశ్రీ
ఒకప్పుడు యువతులు సినిమా రంగంలోకి రావడానికి భయపడేవారు. వారి కుటుంబ సభ్యులకు కూడా అనుమతించే వారు కాదు. అయితే ఆ పరిస్థితి రాను రాను పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని వర్గాలకు చెందిన మహిళలు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్ర పరిశ్రమ గురించి సదాప్రాయం లేని వారు ఉన్నారంటే అది ఆశ్చర్యమే. నటి భాగ్యశ్రీ బోర్సే కుటుంబం ఈ కోవకు చెందినదే. తెలుగు చిత్రం మిస్టర్ బచ్చన్ తో సినీ రంగ ప్రవేశం చేసిన నటి ఈ బ్యూటీ. ఆ తరువాత కింగ్ డామ్ చిత్రం ( అనువాదం) తో కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ కు జంటగా నటించిన కాంత చిత్రం కూడా నిరాశపరిచింది. అయితే ఆ చిత్రంలో నటి భాగ్యశ్రీ బోర్సే నటన అందర్నీ ఆకట్టుకుంది. ఏదేమైనా చిత్రాలు సక్సెస్ అయితేనే అందులో నటించిన హీరో హీరోయిన్లకు నేమ్ ఫేమ్ వస్తుంది. అలా ఐరన్ లెగ్ నటిగా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఇటీవల తెలుగులో నటించిన లెనిన్ చిత్రం సక్సెస్ తో ఆ ముద్రను చెరిపేసుకున్నారు. అయితే ఈమెకు క్రేజీ అవకాశాలు మాత్రం తలుపు తడుతూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం నటుడు శివకార్తికేయన్ కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి భాగ్యశ్రీ బోర్సే తన సినీ రంగ ప్రవేశం గురించి ఇటీవల ఒక భేటీల పేర్కొంటూ ‘‘తను సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు మా కుటుంబంలో ఒక్కరు కూడా సమ్మతించలేదు. ముందుగా నా నిర్ణయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె ససిమేరా వద్దు అని చెప్పారు. నాన్నను అడిగాను. ఆయన అమ్మ వద్దంటుంది కదా అని చెప్పారు. నాకు సోదరి అయిన సపోర్ట్ చేస్తుందని భావించాను. తను కూడా పూర్తిగా వ్యతిరేకించింది. సినిమా రంగం తమ కూతురికి సురక్షితం కాదు అన్నది వారి నిరాకరణకు కారణం. అయినా నా కలను నెరవేర్చుకోవడానికి సినిమాలో నటించడానికే ముందడుగు వేశాను. నేను మొదటిసారిగా అడిషన్ కు వెళ్లినప్పుడు మా అమ్మ కోపంతో నా వాట్సాప్ ను బ్లాక్ చేసింది. అంతేకాకుండా ఆ తర్వాత ఆరు నెలలు ఆమె నాతో మాట్లాడలేదు. అయినా నేను నటిగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు వారు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారులే అనే నమ్మకంతో సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాను. కాగా జీవితంలో ఎవరికి సంశయభావం ఉండకూడదు. ఏం చేయాలని అనిపిస్తుందో అది చేయండి’’ అని నటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. -
అఖిల్ లెనిన్.. బాక్సాఫీస్ సెంచరీతో రికార్డ్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా అదరగొడుతోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది.తాజాగా ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ వందకోట్ల మార్క్ చేరుకుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయ్యగారే నంబర్‌వన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. The ROAR has reached 100 CRORE+ WORLDWIDE GROSS ❤️🔥❤️🔥A celebration that belongs to every audience member who stood by #LENIN 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/gncmWpZkZT— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2026 -
లెనిన్ @ వంద కోట్లు
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని యూనిట్ గురువారం అధికారికంగా ప్రకటించి,పోస్టర్ విడుదల చేసింది. అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలై, మంచి విజయం అందుకుంది.ఈ మూవీ 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు యూనిట్ పేర్కొని, ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అఖిల్ కెరీర్లో వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా ‘లెనిన్’ నిలిచింది. ఇదిలా ఉంటే... అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో గత ఏడాది వంద కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. -
పెళ్లికి ముందే అసలు నిజం చెప్పేశా..! అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్
అక్కినేని అఖిల్.. 'లెనిన్' సినిమాతో కెరీర్లో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఈ నెల 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని చూసిన చాలామంది బాగుందని అన్నారు. అందుకు తగ్గట్లే పర్లేదనిపించే కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన పదకొండేళ్ల తర్వాత అఖిల్ అందుకున్న తొలి హిట్ ఇది. అయితే ఇతడి గత చిత్రం 'ఏజెంట్' ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అఖిల్.. 'ఏజెంట్' ఫ్లాప్ కావడంపై స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)'ఏజెంట్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ ఆ సినిమా చూశాను. స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటే చాలా అసహ్యమేసింది. దాదాపు ప్రతి సీన్లోనూ అతిగా ఓవరాక్టింగ్ చేశానని నాకే స్పష్టంగా అర్థమైంది. అలానే రిలీజ్‌కి ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే ఏదో తేడా కొట్టిందని గ్రహించాను. అదే విషయాన్ని నా ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్లోని కొందరికి చెప్పాను. అయితే నిర్మాత ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడి పెట్టారు. హీరోగా ఆ మొత్తాన్ని వీలైనంత వరకు రికవరీ చేయాలి. కాబట్టి మూవీకి సపోర్ట్ చేయాలని భావించి ప్రమోట్ చేశాను' అని అఖిల్ చెప్పుకొచ్చాడు.అయితే 'ఏజెంట్' సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా దర్శకుడు సినిమా తీశారనే విమర్శలపై స్పందించిన అఖిల్.. ఇకపై తాను ఏ మూవీ కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చేయనని కుండబద్దలు కొట్టేశాడు. 'ఏజెంట్' విషయానికొస్తే.. 2023లో థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి తీసిన ఈ చిత్రం కోసం అఖిల్ చాలానే కష్టపడ్డారు. కండలు పెంచాడు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చాడు. కానీ థియేటర్లలో తొలి షో తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో డైలమాలో పడిపోయిన అఖిల్.. దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని 'లెనిన్'తో వచ్చాడు. సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?) -
షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?
‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్..దాదాపు పదేళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్‌లో వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ..తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో తన పౌరసత్వం గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.ఇండియన్ కాదా?అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా లోని సాన్ జోస్ నగరంలో జన్మించారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం అఖిల్‌కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. ఆయనకు అమెరికా పాస్‌పోర్ట్ కూడా లభించింది. చిన్ననాటి విద్యను హైదరాబాద్‌లోని చైతన్య విద్యాలయంలో ప్రారంభించిన అఖిల్, కొంతకాలం ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. తిరిగి హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యను పూర్తి చేశారు. అనంతరం నటనపై ఆసక్తితో న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేశారు.కొద్ది రోజుల్లో భారతీయుడిని అవుతానుతాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడిన అఖిల్.. ‘ప్రస్తుతం నేను అమెరికన్ పౌరుడినే. నా వద్ద అమెరికా పాస్‌పోర్ట్ కూడా ఉంది. అయితే త్వరనే ఆ పౌరసత్వాన్ని వదులుకుంటాను. ఇంకొన్ని నెలల్లో నేను భారతీయుడిని అయిపోతాను. ఇండియన్ మేరా భారత్ మహాన్’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.I will be Indian citizen soon.. మేర భారత్ మహాన్ - అఖిల్ pic.twitter.com/SWyjQQwIvr— Mr. Akkineni (Sai) (@AkkineniFF) July 24, 2026 -
అఖిల్ లెనిన్.. లవ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలోని వారెవా వారెవా అంటూ సాగే పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు. -
'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)
-
మాకు పండుగ లాగుంది...
-
అన్నయ్య గా నేను చాలా ప్రౌడ్ తమ్ముడూ @ ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్
-
'లెనిన్' బ్లాక్‌బస్టర్ వేడుకలో అఖిల్ ఏమన్నాడంటే..? ఫ్యాన్స్ ఫిదా..!
-
ఒడిస్సీలా మనం ఎందుకు చేయలేం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని అఖిల్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. ఏజెంట్ తర్వాత అఖిల్‌కు హిట్ పడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన నాగార్జున టాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ముఖ్యంగా సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై నాగార్జున కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు. ఒడిస్సి మూవీ ఏడాది కిందట రిలీజ్ డేట్ ప్రకటించి అదే తేదీకి విడుదల చేశారు. కానీ మనం రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ టైమ్‌కు రిలీజ్ చేయలేకపోతున్నామని అన్నారు. లెనిన్ విషయంలోనూ అదే జరిగిందని తెలిపారు. గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీని చూసేవాళ్లమని నాగ్ వెల్లడించారు. ఇప్పుడు అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే నా ప్రశ్న అని అన్నారు. ప్రకటించిన తేదీకే అందరు సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాను కనీసం రెండు వారాల ముందు ఇస్తే బాగుంటుందని నాగ్ అన్నారు. Lenin Blockbuster Mikela Undho Theliyadhu Kani Naku, Chaitanya Ki, Akhil Ki Pandaga Laa Undhi, Illantha Kalakalalaaduthundhi - King @iamnagarjuna speech @ #LENIN Blockbuster Vaibhavam Event ❤️🔥 #BlockbusterLENIN 📷🌋 pic.twitter.com/bw3bAtC4ca— Annapurna Studios (@AnnapurnaStdios) July 20, 2026 -
కెరీర్లో మొదటి హిట్.. భాగ్యశ్రీ రెమ్యునరేషన్ డబుల్!
ఏ రంగంలో అయినా సక్సెస్ ఉన్నోడిదే రాజ్యం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటే దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. లేదంటే ఎవరూ పట్టించుకోరు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా 'లెనిన్' మూవీతో అఖిల్ తొలి సక్సెస్ అందుకున్నాడు. అదే టైంలో హీరోయిన్ భాగ్యశ్రీకి కూడా ఇదే తొలి హిట్ కావడం విశేషం. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది: కాజల్)ఉత్తరాది భామ అయిన భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఘోరమైన డిజాస్టర్ అయింది. దీని తర్వాత కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా అని వరస మూవీస్ చేసింది గానీ హిట్ దక్కలేదు. అయితే అఖిల్ 'లెనిన్'లో తొలుత శ్రీలీలని హీరోయిన్ అనుకున్నారు కానీ ఆమె సైడ్ కావడంతో ఈ అవకాశం భాగ్యశ్రీని వరించింది.భారతి పాత్రలో అందచందాలతో ఆకట్టుకున్న భాగ్యశ్రీకి.. 'లెనిన్'తో సక్సెస్ దక్కింది. మరీ సూపర్ హిట్ కానప్పటికీ యాక్టింగ్, గ్లామర్ పరంగా భాగ్యశ్రీకి మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పటివరకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా సరేనంటున్నారని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
100 కోట్లవైపు లెనిన్.. కింగ్ 100లో ముగ్గురు మొనగాళ్లు
-
ఐరన్ లెగ్ అని ముద్ర వేయకండి : హీరోయిన్ విజ్ఞప్తి
ఏ రంగానికి చెందిన వారికైనా అవమానాలు, అవరోధాలు ఎదురుకావడం సహజం. ముఖ్యంగా సినిమా రంగంలోని వారికి ఇలాంటి ఇబ్బందులు కాస్త ఎక్కువే ఉంటాయి. ఒక్కోసారి శాయశక్తులా శ్రమించినా తమనే కార్నర్ చేసే విమర్శలు గుండెల్లో కలుక్కుమంటుంటాయి. నటి భాగ్యలక్ష్మి భోర్సే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందట. అలా తన ఆవేదనను ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేసిందీ బ్యూటీ. నిజం చెప్పాలంటే నటిగా ఈ అమ్మడికి అదృష్టం ఉన్నా, సరైన విజయం వరించలేదు. తెలుగులో రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టినా, ద్విభాషా చిత్రం కాంతాలో దుల్కర్ సల్మా న్ వంటి నటుడితో రొమాన్స్ చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ మంచి సక్సెస్ మా త్రం దోబూచులాడుతూనే ఉంది. అలాంటిది తాజాగా అఖిల్ అక్కినేనితో జత కట్టిన లెనిన్ చిత్రం సంతృప్తి కరమైన విజయాన్ని అందించింది. దీంతో చాలా కాలంగా గూడు కట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. దాన్ని ఒక భేటీలో వ్యక్తం చేస్తూ. ‘‘చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ చిత్ర కథానాయికిని కార్నర్ చేస్తూ ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయకండి. చిత్ర అపజయాన్ని హీరోయిన్లకు మాత్రమే ఆపాదించడం ఎంత వరకు న్యాయం. నేనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను’’ అంటూ విమర్శకులపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తోంది. -
అఖిల్ లెనిన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు.సినిమా బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తోన్న వేళ.. మేకర్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లెనిన్ మూవీ నుంచి ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. బ్లాక్‌బస్టర్ మాషప్ పేరుతో ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అఖిల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్పెషల్ వీడియో చూసేయండి. -
లెనిన్ విలన్.. ప్రభాస్‌ను అంత మాట అనేశాడా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్ లెనిన్‌లో విలన్‌గా మెప్పించిన కన్నడ నటుడు ప్రమోద్ పంజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీట్లో ప్రభాస్ గురించి మాట్లాడారు. ఆయనలో తనకు నచ్చింది హాస్పిటాలిటీ అని తెలిపారు. అఖిల్ అన్నలో కూడా అదే చూశానని కొనియాడారు. అయితే ప్రభాస్‌ను పొగిడే క్షణంలో వాడు అని ప్రమోద్ సంభోదించారు. తెలుగు సరిగా రాకపోవడం వల్లా అలా అన్నారా.. లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రభాస్‌ను వాడు అని సంభోధించడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. India’s Biggest Star #Prabhas ని “వాడు” అని సంబోధించిన #Lenin Villain🤯 pic.twitter.com/1xFNLFUQ1u— cinee worldd (@Cinee_Worldd) July 15, 2026 -
‘అయ్యగారి’ని కలిసిన అభిమాని.. కన్నీళ్లు తూడుస్తూ అఖిల్ ఎమోషనల్!
‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ తనపై ప్రేమను చాటిన వీరాభిమాని నాగరాజును అఖిల్ అక్కినేని ఎట్టకేలకు కలిశాడు. నిన్న(జులై 15) గుంటూరులో జరిగిన ‘లెనిన్’ సక్సెస్ మీట్ అనంతరం అఖిల్ తన అభిమాని నాగరాజుని కారవాన్‌లోకి పిలిపించుకొని మాట్లాడాడు. ఈ సందర్భంగా నాగరాజు ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ కాళ్ల మీద పడిపోయి బోరున ఏడ్చేశారు. అతణ్ని ఓదారుస్తూ అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది అని చెప్పాడు. తర్వాత తన భార్యను పరిచయం చేశాడు కూడా. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అఖిల్ కెరీర్ ఆరంభంలో ఈ అభిమాని‘అయ్యగారే నంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత అఖిల్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే.. అందరి దృష్టి ఈ అభిమాని మీదకు వెళ్తుంది. లెనిన్ మూవీ రిలీజ్ ముందు కూడా నాగరాజు వీడియో మళ్లీ వైరల్ అయింది. కొంతమంది యూట్యూబర్లు అతన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. నాగరాజు కల్మషం లేని అభిమానం చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఒక్కసారైనా హీరోని కలిస్తే బాగుండేదని కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్లే..నిన్న నాగరాజుకు అఖిల్‌ను కలిసే అవకాశం దొరికింది. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
అయ్యగారే నంబర్‌వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లెనిన్ సక్సెస్‌పై జైనాబ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా అయ్యగారే నెంబర్ వన్ అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా లెనిన్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. #Lenin చూసి #AkhilAkkineni wife #Zainab కూడా ఒకే మాట...' అయ్యగారే నెంబర్ 1 '#Lenin Success Celebrations at Gunturpic.twitter.com/mVE9jJid5r— Taraq(Tarak Ram) (@tarakviews) July 15, 2026 -
నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?
సాంకేతికంగా ప్రపంచం ఎంతలా అభివృద్ధి చెందినా సరే కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్స్ అలా ఉండిపోతాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతారు, పాటిస్తారు. రీసెంట్ టైంలో టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పెళ్లి చేసుకున్న వెంటనే పలువురు సెలబ్రిటీలు గుర్తుండిపోయే హిట్స్ కొట్టేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్)కిరణ్ అబ్బవరం హీరోగా చాలా సినిమాలు చేశాడు గానీ తొలి మూవీ తప్పితే మిగిలినవి ఏవీ సక్సెస్ కాలేదు. అలాంటి టైంలో అంటే 2024లో తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే 'క' మూవీతో వచ్చాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు.గతేడాది ఫిబ్రవరిలో నాగచైతన్య 'తండేల్'తో వచ్చాడు. అంతకు సరిగ్గా రెండు నెలల ముందే శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చైతూ 'తండేల్'తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం 'వృషకర్మ' మూవీ చేస్తున్నాడు. దీనిపై బజ్ బాగానే ఉంది.గతేడాది డిసెంబరులో సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. 'ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కట్ చేస్తే లాంగ్ గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' మూవీతో సామ్ రీఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందు దీనిపై పెద్దగా బజ్ లేదు. కానీ ఊహించని విధంగా మూవీ హిట్ కావడంతో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీతోనూ ఉంది. అది ఇంకో గుడ్ న్యూస్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)గతేడాది జూన్‌లో అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు జైనబ్ మెడలో మూడుముళ్లు వేశాడు. సరిగా ఏడాది తిరిగేసరికల్లా ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న హిట్ 'లెనిన్' రూపంలో దక్కింది. ప్రస్తుతం అఖిల్ ఫుల్ హ్యాపీ. ఇదే ఊపులో జాగ్రత్తగా మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాడు. ఇలా వరసగా నలుగురు స్టార్స్ అలా పెళ్లిచేసుకున్నారో లేదో ఇలా కెరీర్లోనే గుర్తుండిపోయే సక్సెస్‌ని అందుకున్నారు.ఈ లిస్టులో ఇంకా ముగ్గురు మిగిలున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. రష్మికకు ఎలానూ హిట్స్ ఉన్నాయి కానీ విజయ్‌కే కెరీర్ ప్రారంభంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' తప్పితే చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్ కూడా రీసెంట్ టైంలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతానికైతే వీళ్లు ముగ్గురు మాత్రమే వివాహం చేసుకుని హిట్ విషయంలో పెండింగ్‌లో ఉన్నారు. ఒకవేళ వీళ్లు కూడా సక్సెస్ అందుకుంటే 'పెళ్లి' సెంటిమెంట్, టాలీవుడ్లో మరింత పాపులర్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా) -
మా అమ్మ భావోద్వేగానికి గురయ్యారు: భాగ్యశ్రీ బోర్సే
‘‘లెనిన్’ సినిమా విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను చేసిన భారతి పాత్ర పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ జీవితాంతం మర్చిపోలేను. ‘లెనిన్’లో నా నటన పట్ల మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మగారు నాకు ఫోన్ చేసి, ‘సినిమా చాలా బాగుంది.. నీ నటన కూడా ఎంతో బాగా అనిపించింది’ అన్నారు.అయితే భారతి పాత్ర ముగింపు చూసి ఒక తల్లిగా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే అలాంటి ముగింపును ఏ తల్లి కూడా కోరుకోదు కదా?’’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో భారతి పాత్ర పోషించిన భాగ్యశ్రీ బోర్సే చెప్పిన విశేషాలు... ⇒ ‘‘లెనిన్’ కథని మురళీ కిషోర్‌గారు చెప్పినప్పుడే నా మనసుకు హత్తుకుంది. భారతి పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఆ పాత్రను ఇంతగా అభిమానించడం చాలా సంతోషంగా ఉంది. భారతి పాత్ర గురించి అందరూ ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. నాగార్జునగారు నా నటన గురించి మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్రశంసలు నాకు సంతోషంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయి. ⇒ ఋలెనిన్–భారతిల ప్రేమకథే ‘లెనిన్’. అఖిల్, నా పాత్రలు తెరపై చాలా సహజంగా కనిపించేలా ప్రతి సన్నివేశంపై ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేశాం. భవిష్యత్తులో మహారాణి, యువరాణి వంటి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి చిత్రాల విషయంలో రాజమౌళిగారు మాస్టర్. ఏదో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంతగారు అద్భుతంగా నటించారు. మాలాంటి కొత్త నటీమణులకు ఆమె ఒక దారి చూపించారు. అవకాశం వస్తే అలాంటి మహిళా ప్రధాన పాత్రలు కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో తమిళంలో ‘సీయోన్’ సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని కథలు వింటున్నాను. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. -
లెనిన్తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..!
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన అఖిల్ సక్సెస్ కొట్టేశాడు.లెనిన్పై కాపీ ట్రోల్స్..లెనిన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మేకర్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. లెనిన్ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కాపీ చేశారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. లెనిన్‌లో హైలెట్‌గా నిలిచిన క్లైమాక్స్ సీన్‌ను మక్కీకి మక్కీ దించేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది. 1999లో బాలయ్య నటించిన క్రిష్ణబాబు మూవీలోని సీన్‌ను తలపిస్తోందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సేమ్ టూ సేమ్.. 1999లో వచ్చిన క్రిష్ణబాబు మూవీలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి.. ఆమె అరవకుండా చేసి.. హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి హీరోయిన్ను చంపేలా చేస్తాడు. అచ్చం అలానే ఈ చిత్రంలో విలన్ హీరో కళ్లల్లో కెమికల్ కొట్టడం.. హీరోయిన్ నోట్లో గుడ్డలు కుక్కడం.. చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్‌ను దించేశారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో ఈ తరం ప్రేక్షకులకు తగినట్లుగా సీన్ రీ క్రియేట్ చేశారని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై లెనిన్ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి నటించిన చిత్రం క్రిష్ణబాబు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజై ఓ మాదిరి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సీన్‌నే.. లెనిన్ టీమ్ కాపీ చేశారని అంటున్నారు. -
లెనిన్ సక్సెస్.. అఖిల్‌పై మెగాస్టార్ ప్రశంసలు
అక్కినేని అఖిల్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.స్పందించిన అఖిల్...మెగాస్టార్ ట్వీట్‌కు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.Congratulations to my dear friend @iamnagarjuna, the entire…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026 -
నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. ‘లెనిన్’పై ఆర్జీవీ రివ్యూ
అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’ తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. “వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు” అంటూ ప్రమోషన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వసూళ్ల వివరాలు పక్కన పెడితే.. అఖిల్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంతో ఆయన తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియాలో అఖిల్‌ను అభినందించారు. హే అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్.. ప్లీజ్ సినిమా చూడండి అని రిప్లై ఇచ్చారు. Hey @AkhilAkkineni8 Just saw #Lenin , and apart from the FILM being GREAT , I realised that you are the BEST ACTOR in the #Akkineni family and I swear this on @iamnagarjuna 🔥🔥 Your ease is remarkable even when there’s no emotion in the scenes and in the emotional scenes you… https://t.co/az4x6dFsTL— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2026తాజాగా సినిమా చూసిన ఆర్జీవీ, ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. ఆయన అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అని ఆర్జీవీ పేర్కొన్నారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించే ఈజ్ అద్భుతం, భావోద్వేగ సన్నివేశాల్లో అయితే అదరగొట్టేశాడని వర్మ అభిప్రాయపడ్డారు. అఖిల్‌కు ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
అఖిల్ లెనిన్ కలెక్షన్స్.. మొదటి రోజు కంటే ఎక్కువే
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.ఈ మూవీకి తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డేనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లెనిన్‌కు పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దీంతో రెండో రోజు ఆడియన్స్‌లో అదే జోరు కనిపించింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు కంటే రెండో రోజే వసూళ్లలో పెరుగుదల కనిపించింది. వీకెండ్ కావడంతో మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. The word of mouth is doing wonders ❤️The audience is doing the rest 💪🏼37.2 CR+ Worldwide Gross in just 2 days 💥💥#LENIN is marching from strength to strength 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman… pic.twitter.com/SQbib4c1mt— Sithara Entertainments (@SitharaEnts) July 12, 2026 -
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. 'లెనిన్'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలిరోజు కొందరి నుంచి మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ ఓవరాల్‌గా అయితే రెస్పాన్స్ బాగుంది. తొలి సక్సెస్ అందుకునేసరికి అటు అఖిల్, ఇటు భాగ్యశ్రీ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో హీరోయిన్ శ్రీలీలని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?)శ్రీలీలపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేయడానికి ఓ కారణం కనిపిస్తోంది. 'లెనిన్' సినిమాని ప్రకటించి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు మొదటగా అనుకున్న హీరోయిన్ శ్రీలీలనే. అయితే తర్వాత ఈమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. సినిమాలోని ఈమె ఫెర్ఫార్మెన్స్, గ్లామర్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఒకవేళ ఇదే ప్లేసులో శ్రీలీల ఉండుంటే కచ్చితంగా ఇలా చేసేది కాదని, సినిమాకు మైనస్ అయ్యిండేదని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.ఒకవేళ నిజంగా శ్రీలీల.. 'లెనిన్' సినిమా చేసుంటే ఎలా ఉండేదో ఏమో గానీ సోషల్ మీడియాలో ఈమెని విమర్శించడం ఎక్కువైపోయింది. గతంలో శ్రీలీల తెలుగులో చాలా మూవీస్ చేసింది గానీ వీటిలో 'ధమాకా' తప్పితే మిగతా ఏది కూడా హిట్ కాలేదు. రొటీన్ క్యారెక్టర్స్ చేస్తుందని శ్రీలీలపై గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా 'లెనిన్' ప్రస్తావన తీసుకొచ్చి ఈమెని టార్గెట్ చేస్తున్నారు.ఈ ఏడాది రిలీజైన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల చివరగా కనిపించింది. ఇదెంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హిందీలో ఒకటి, తమిళంలో మరొకటి చేస్తోంది. అసలు తెలుగులో కొత్తగా ఏం మూవీస్ చేయనప్పటికీ ట్రోలింగ్ వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది.(ఇదీ చదవండి: మా వాడికి హిట్ ఇవ్వమని దేవుడిని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది) -
ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు మీ అభిమానం చూస్తే ఏడుపొస్తోంది
-
మా వాడికి హిట్ ఇవ్వండని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమొచ్చింది
అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. థియేటర్లలోకి రిలీజైన 'లెనిన్' పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులోనే నాగార్జున మాట్లాడుతూ తన కొడుకు అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?)'అఖిల్‌లో సాధించాలనే తపన ఉంది. చిన్నప్పటి నుంచే ఎనర్జీతో ఉండేవాడు. అందుకే డాక్టర్స్ కూడా వాడిని నేలపై పడుకోబెట్టమని చెప్పేవారు. అలాంటి అఖిల్ సినిమాల కోసం కష్టపడ్టాడు కానీ ఆశించిన విజయం రాలేదు. బయటకు ఏది మాతో చెప్పడు. గాయాలపాలయ్యాడు. కామ్ అయిపోయాడు. తనలో తాను ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లోకి తన తోడు వచ్చాక తన గుడ్ టైమ్ మొదలైంది. అప్పటినుంచి అతడి ఆలోచన విధానం కూడా మారింది. పైనల్లీ లెనిన్ రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఎస్ అయ్యగారే నెంబర్ వన్.''ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను. ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం 'మా వాడికి ఒక హిట్ ఇవ్వండి' అని అడిగాను. ముందుగా ఆయనికి కృతజ్ఞతలు. తర్వాత మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్‌కి థ్యాంక్స్' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ) -
‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని ఖాతాలో హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జులై 10న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించండంతో, తమ హీరోకి హిట్ పడిదంటూ అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. చిత్తూరు యాసతో ఆయన చెప్పిన డైలాగులు..ప్రేక్షకులను ఈళలు వేయిస్తున్నాయి. అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. లెనిన్ కథేంటంటే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.AKHIL 2.0 is here... and the box office has heard it loud and clear 🔥🔥🔥A phenomenal 16.7 CR+ Worldwide Gross on Day 1 for #LENIN 💥💥💥The Telugu audience has once again celebrated good cinema in the grandest way possible 🫶🏻🫶🏻#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8… pic.twitter.com/UOKexRK2CA— Annapurna Studios (@AnnapurnaStdios) July 11, 2026 -
చివరి సినిమా కూడా ఇక్కడే.. కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ
‘లెనిన్’తో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె భారతి అనే పాత్రను పోషించింది. జులై 10న ఈ చిత్రం విడుదల కాగా.. తొలి రోజు హిట్ టాక్ వచ్చింది. అఖిల్‌తో పాటు భాగ్యశ్రీ నటనపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధించిందన్నారు భాగ్యశ్రీ. తాజాగా ఈ సినిమా టీమ్ సక్సెస్‌లో మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. ‘లెనిన్’టీమ్‌తో ఏడాదిన్నర పాటు జర్నీ చేశాను. ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. మీ(ఫ్యాన్స్) వల్లే నేను ఇక్కడ ఉన్నాను’ అంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్ తన కర్మభూమి అని.. తన చివరి సినిమా కూడా తెలుగులోనే చేయాలాని కోరుకుంటున్నానని చెప్పింది. Bhagyashri ఎమోషనల్ అయిపోయింది.సోషల్ మీడియాలో చాలా Casual గా మాటలు అనేస్తారు But it will cause deep mental agony. Be considerate! #Lenin pic.twitter.com/lOHJFY38Ai— Journalist Nishant (@NishantOpinions) July 11, 2026 -
లెనిన్ సినిమాపై షాకింగ్ రివ్యూ
-
హిట్ కొట్టేశాం నాన్న.. తండ్రిని పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
మూడేళ్ల తర్వాత హిట్.. అఖిల్ ఫుల్ ఎమోషనల్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రానికి హిట్ టాక్ రావడంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి నాగార్జునను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ కట్ చేస్తుండగా నాగార్జున కాళ్లకు నమస్కరించిన అఖిల్.. ఆయనతో గట్టిగా కౌగిలించుకుని ఎమోషనలయ్యారు. ఈ వీడియోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. A blockbuster on screen.A priceless moment off screen. ❤️A hug that spoke louder than words…#LENIN #BlockbusterLENINBook your tickets now 🎫 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/YHgBKwEmBI— Sithara Entertainments (@SitharaEnts) July 10, 2026 -
లెనిన్ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా పట్టా?
-
ఈ రివ్యూ చూస్తే.. పడి పడి నవ్వుతారు?
-
లెనిన్ మూవీ పబ్లిక్ టాక్.. ఒక్క ముక్కలో తేల్చేశారుగా!
-
అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్.. హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు గానీ సరైన హిట్ కొట్టలేకపోయాడు. 'ఏజెంట్' డిజాస్టర్ దెబ్బకు మూడేళ్ల గ్యాప్ తీసుకుని 'లెనిన్' సినిమా తీశాడు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్‌తో దీనిపై బజ్ క్రియేట్ అయింది. అలా ఇప్పుడు(జూలై 10) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉంది? అఖిల్ హిట్ కొట్టాడా లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అఖిల్ 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ 11 ఏళ్లలో ఐదు సినిమాలు చేశాడు. వీటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓ మాదిరిగా ఆకట్టుకోగా, మిగిలినవన్నీ దారుణంగా ఫెయిలయ్యాయి. దీంతో అఖిల్ మూవీ వస్తుందంటే చాలు.. ఈసారైనా హిట్ కొడితే బాగుండు అని అభిమానులు అనుకుంటారు. మరి 'లెనిన్'తో సక్సెస్ అందుకున్నాడా అంటే అందుకున్నాడు!'లెనిన్' గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే పక్కా కమర్షియల్ టెంప్లేట్లో సాగిన సినిమా. సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని షాకింగ్ ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరో పక్కన ఉండే పాత్రల్లో కాస్త పేరున్న నటీనటుల్ని పెట్టారంటే వీళ్లతో ఏదో ట్విస్ట్ ప్లాన్ చేశారని ముందు నుంచి అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ట్విస్టులు ఉంటాయి. కాకపోతే ఆయా పాత్రలు, సదరు ట్విస్టుల వెనుకున్న రీజన్స్ మరీ వావ్ అనిపించకపోయినా పర్లేదనిపిస్తాయి.మూవీ మొదలైన తొలి గంట వరకు ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్లు మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. జైలు నుంచి హీరో విడుదలవడం, ఓ వ్యక్తితో తన కథంతా చెప్పడం, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. హీరో ఒరిజినల్ ఎంట్రీ, ఆపై పాట, హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఓ రెండు డ్యూయెట్స్.. ఇలా అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ఆ తర్వాత ట్విస్టులు మొదలవుతాయి. అక్కడి నుంచి మధ్యమధ్యలో కాస్త మూవీ డౌన్ అయినప్పటికీ చివరకు హీరో, విలన్ని చంపే సీన్‌తో సినిమా ముగుస్తుంది.ఈ సినిమాని మహాభారతంలోని రిఫరెన్స్‌లు చూపించిన తీరు, వాటిని ఎలివేషన్స్ కోసం ఉపయోగించుకోవడం బాగానే ఉంది. లెనిన్ ఒక్కడినే మూవీ అంతా చూపించాలని కాకుండా వసంత్, జయంతి, భారతి, యతిరాజులు పాత్రలని కూడా కథక తగ్గట్లు ఉపయోగించుకున్న తీరు కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. 'కూతురు కనిపించకపోతే కూతుర్ని వెతకాలి గానీ మీరు పరువుని వెతుక్కున్నారు నాన్న', 'లెనిన్ నా గుండెల్లో ఉన్నాడు అయినా సరే నువ్వు నా గుండెల మీద పడుకుంటానంటే చెప్పు' లాంటి డైలాగ్స్ సరిగ్గా పడ్డాయి.లెనిన్ అసలు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ మాత్రం సరిగా ఎష్టాబ్లిష్ చేయలేదు. అప్పటివరకు తన చుట్టూరా మందితో బలంగా కనిపించిన విలన్.. హీరో వేసిన ఒక్క దెబ్బకే చనిపోవడం కూడా ఏదో కృతకంగా అనిపించింది. కనీసం ఇద్దరి మధ్య కాస్త ఫైట్ లాంటిది నడిపించకుండానే చంపేయడం సింపుల్‌గా అనిపించింది. తల, కాలు నరికేయడం లాంటి సీన్స్ సున్నిత మనస్కులకు ఇబ్బంది పెట్టొచ్చు.ఎవరెలా చేశారు?ఇప్పటివరకు అఖిల్ యాక్టింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. 'లెనిన్'తో వాటిని చాలావరకు అధిగమించాడని చెప్పొచ్చు. ఫైట్స్, ఎమోషన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ సినిమాకే కీలకమైన భారతి పాత్రలో భాగ్యశ్రీ ఆకట్టుకుంది. కానీ ఫస్టాప్‌లో అఖిల్-భాగ్యశ్రీ పాత్రల మధ్య డ్రామా ఇంకాస్త బలంగా చూపించి ఉంటే చివరలో ఎమోషన్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది. మిగతా వాళ్లలో ఈశ్వరీరావు చేసిన జయంతి పాత్ర బాగుంది. వసంత్‌గా చేసిన ప్రమోద్, యతిరాజులుగా చేసిన శివాజీ కూడా తమ పాత్ర వరకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కాకపోతే చాలావరకు సెట్స్ అని తెలిసిపోతోంది. ఇవి కాస్త నేచురల్‌గా ఉండాల్సింది. తమన్ గురించి తెలిసిందేగా. తనకు అలవాటైన రీతిలో డ్రమ్స్ వాయించాడు. పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేలా ఉండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చెవుల్ని హోరెత్తించింది. డైరెక్టర్ కమ్ రైటర్ మురళీ కిశోర్ అబ్బూరు ఈ మూవీతో కమర్షియల్‌గా ఏమేం చేయాలో అన్నీ చేశాడు. ఇక హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.- చందు డొంకాన (ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ) -
అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ చేసిన సినిమా 'లెనిన్'. దాదాపు 11 ఏళ్లుగా పలు మూవీస్ చేసినప్పటికీ సక్సెస్ అనేది అఖిల్‌కి అందలేదు. చివరగా వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ కావడంతో కాస్త శ్రద్ధ తీసుకుని 'లెనిన్' చేసినట్లు టీమ్ అంతా చెబుతూ వచ్చారు. ఇప్పుడిది థియేటర్లలో రిలీజైపోయింది. మరి చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు?తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు షోలు పడ్డాయి. ఓవర్సీస్లో అంతకు కాసేపటి ముందు షోలు పడ్డాయి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాప్ ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు. లవ్ స్టోరీ ఓకే ఓకే అనిపించినప్పటికీ మహాభారతం రిఫరెన్స్‌లు వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. అఖిల్ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాడని, ఇంటర్వెల్ కూడా బాగుందని అంటున్నారు. ఓవరాల్‌గా ఇదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే ఉందని, కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)#Lenin First Half : Decent!!The pre-interval to interval block is handled well. Despite a few flaws, the narration remains gripping for the most part.Undoubtedly, #AkhilAkkineni delivers the best performance of his career by a mile. #BhagyashriBorse shines, and Thaman’s…— cinee worldd (@Cinee_Worldd) July 10, 2026#LeninNarration is gripping throughout the first half. Great vision for blending Mahabharatam references into storyAkhil looks completely rooted in this role. Good interval episode. Excited for the second half 🙌🏻🙌🏻🔥🔥pic.twitter.com/yfZKCImm2N— Chimtu (@AkkineniCults) July 9, 2026Akhil babu comeback 🔥🔥#Lenin pic.twitter.com/jYdxHlKCCt— అభి (@Abhiiitweets) July 10, 2026Decent first half.. Akhil seems very much improved, he’s too good in this so far. His pairing with Bhagyashri worked very well #Lenin https://t.co/8aFZn4jMWh— Sai Kiran (@saikirantweetz) July 10, 2026#Lenin Template Commercial Film with a Few Interesting Twists!Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and…— Venky Reviews (@venkyreviews) July 10, 2026 -
‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో భాగ్యశ్రీ బోర్సే .. (ఫొటోలు)
-
అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్
కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్ పండించగలిగితే చాలు. కొందరు హీరోలకు ఈ ఇమేజ్ సంపాదించడానికి ఏళ్లు పడుతుంది. మరికొందరికి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే సదరు ఇమేజ్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్లలో అక్కినేని అఖిల్ ఒకడు. తాత, తండ్రి, సోదరుడు హీరోలు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ. కానీ అఖిల్ సినీ జాతకంలో హిట్ అనే లోటు ఉండిపోయింది. మరి అఖిల్ 'లెనిన్'తో హిట్ కొడతాడా? అసలు ఈ మూవీ ఎందుకంత కీలకం?(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ)2015లో హీరోగా పరిచయమైన అఖిల్.. అంతకు ముందు అంటే చిన్నప్పుడే 'సిసింద్రీ'లో నటించాడు. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే ఇండస్ట్రీకి వచ్చేశాడు. పెరిగి పెద్దయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'లో అతిథి పాత్రలో కనిపించాడు. కుర్రాడికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని అందరితో అనిపించుకున్నాడు. అలా 2015లో 'అఖిల్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ చూసి హిట్ లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ అలా అస్సలు జరగలేదు.2015లో 'అఖిల్' వచ్చింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ ఇలా వరసగా మూవీస్ అయితే వచ్చాయి గానీ హిట్ హీరో అని మాత్రం అఖిల్ అనిపించుకోలేకపోయాడు. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించుకున్నాయంతే. దీంతో హీరో అయ్యి పదకొండు సంవత్సరాలు గడిచినా అఖిల్ గురించి ఇప్పటికీ ఒకే మాట వినిపిస్తుంది. 'అతనిలో టాలెంట్ ఉంది కానీ దాన్ని నిరూపించే సినిమా మాత్రం ఇంకా రాలేదు' అని.అయితే అసలు సమస్య అఖిల్ చేసే సినిమాల స్క్రిప్ట్లదా? ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడకపోవడమా? లేదంటే ప్రతి సినిమాతో కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ఐడెంటిటీని నిర్మించుకోలేకపోవడమా? అనేది అర్థం కాని ప్రశ్న. మరి ఈ శుక్రవారం(జూలై 09) విడుదలయ్యే 'లెనిన్'తో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా అనేది చూడాలి? ఎందుకంటే ఈ మూవీ సక్సెస్ అఖిల్‌కి చాలా అంటే చాలా ముఖ్యం.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)చాలామంది హీరోలు కెరీర్ ప్రారంభంలో ఒకే తరహా ఇమేజ్‌ని ఏర్పరుచుకుంటారు. అఖిల్ మాత్రం ప్రతి సినిమాతో కొత్త రూపంలో కనిపించేందుకు ప్రయత్నించాడు. అవే మైనస్‌లు అయ్యాయా అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల జానర్లు ట్రై చేశాడు కానీ వాటి కథాకథనాలు బలహీనంగా ఉండేసరికి మూవీస్ ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖిల్ ఫ్లాప్ హీరోగా మిగిలిపోయాడు.మూడేళ్ల క్రితం అంటే 2023లో విడుదలైన 'ఏజెంట్' కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్, పాన్ ఇండియా ఇమేజ్ టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం పూర్తిగా తేలిపోయింది. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాలు, నటన.. దాదాపు ప్రతి అంశంపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన ఈ సినిమా చాలా కాలం పాటు ఓటీటీలోకి కూడా రాలేదు. దీంతో అఖిల్ కూడా లాంగ్ గ్యాప్ తీసుకుని 'లెనిన్' చేశాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. యాక్షన్ ఉన్నప్పటికీ ట్విస్టులు, ఎమోషన్స్‌కి కూడా చోటిచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రస్తుతానికైతే అన్ని ఎలిమెంట్స్ అఖిల్‌కి పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. ఇక హిట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ 'లెనిన్' ప్రేక్షకులను మెప్పిస్తే, అది అఖిల్‌కు హిట్ ఇవ్వడమే కాదు. గత 11 ఏళ్లుగా వెతుకుతున్న ఒక స్పష్టమైన స్క్రీన్ ఐడెంటిటీని కూడా అందించగల సినిమా అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్) -
'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
లెనిన్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
అక్కినేని అఖిల్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.లెనిన్ ట్రైలర్‌కు నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు. తాజాగా మరో హీరో లెనిన్ కోసం తన వాయిస్ ఓవర్ అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీరామాపురం, భారతంమిట్ట గ్రామాలు.. అందులోని మనుషులను తీరు తెన్నులను ఎన్టీఆర్ తన వాయిస్ ద్వారా చెప్పనున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనిని కూడా పూర్తి చేశారు మన యంగ్ టైగర్. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్.. జూనియర్ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. Thank you Tiger🐅. Thanks for roaring for #Lenin. 🙏🏻🙏🏻🙏🏻Eppatiki marichipolenantha Prema ichhavu. Love you brother @tarak9999 ❤️ pic.twitter.com/D2Xd0pZDpH— Akhil Akkineni (@AkhilAkkineni8) July 6, 2026 -
అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున
‘‘లెనిన్’ రాయలసీమ కథ. సింపుల్‌గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం. ఈ సినిమాకు ముందు అఖిల్ ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్ చేశాడు. మరి... ఈ సినిమాకి సూట్ అవుతాడా? అని ముందు నాకు భయంగా ఉండేది. కానీ సినిమా చూశాక, నేను కాదు... అందరూ ఆశ్చర్యపోయారు. ‘లెనిన్’ రోల్‌లోకి అఖిల్ వెళ్లిపోయాడు. సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని, ప్రేమను, పగని కూడా ప్రేమిస్తారు. లెనిన్ ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోతారు. మీకు అఖిల్ కనపడడు... ‘లెనిన్ ’ కనిపిస్తాడు’’ అని నాగార్జున అన్నారు. అఖిల్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లెనిన్ ’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మురళీ కిషోర్ అబ్బూరు (నందు) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఆదివారం తిరుపతిలో జరిగిన ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. ప్రేమకోసం రాజ్యాలు కూలిపోయాయి. ‘లెనిన్’లో కూడా ఒక ప్రేమకథ ఉంది. నందు ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. ‘శ్రీరామపురం’ అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు (కృష్ణా జిల్లా). అయితే ఈ శ్రీరామపురం చిత్తూరు జిల్లాలో అని చెప్పాడు. కానీ శ్రీరామపురం అంటే నాకో సెంటిమెంట్. దీంతో నందును కథ చెప్పమన్నాను. నందు కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఇందులో పాత్రలు డిఫరెంట్‌గా అనిపించాయి. ‘లెనిన్’ సెకండాఫ్‌లోని ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఊహించలేరు. మా పార్ట్నర్ నాగవంశీకి ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ అంటే... ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మన అందరికీ దేవుడు ఆ వెంకటేశ్వరస్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు ఆయనకు దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో... ఈ ప్రేక్షక దేవుళ్లుకు చెబుతున్నాను. జూలై 10న వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు’’ అని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘లెనిన్’ఉద్దేశం ఒకటే. నేను మీ ఇంటివాడినైపోవాలి. మీ సీమ బిడ్డ మురళీకిషోర్ రెండేళ్ల క్రితం ఈ సినిమా కథ చెప్పారు. నేను చేయాలనుకున్న కథ ఇదే అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ మూవీలో భారతి అనే పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. ‘‘నాగేశ్వరరావుగారి మనవడు, నాగార్జునగారి అబ్బాయి అఖిల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. పెద్ద కష్టపడలేడని అంటుంటారు. కానీ సోల్ ఆఫ్ లెనిన్ వచ్చినప్పట్నుంచి ‘అఖిల్ ఫస్ట్ టైమ్ కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది కదరా’ అనేవాళ్లు. ఈ అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు అఖిల్గారు ఎంత కష్టపడ్డారో మేం చూశాం. ఇది రెగ్యులర్ మాస్ మూవీ కాదు. రెండు మూడు చోట్ల ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. అలాంటి స్క్రీన్‌ప్లే రాశాడు నందు’’ అన్నారు నాగవంశీ. బ్రహ్మాజీ, సునీల్ మాట్లాడారు. -
ఈసారి ఎలైనా కొట్టాలి నాకు ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ బాగా క్లోజ్
-
సమంతకు కంగ్రాట్స్.. ట్రైలర్ చూసి ఫిక్సయ్యా: అఖిల్
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని లేటేస్ట్ మూవీ లెనిన్ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ స్టోరీగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అఖిల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీ హిట్ కావడంపై సమంతకు విషెస్ తెలిపారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిందన్నారు.అఖిల్ మాట్లాడుతూ..' నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ ట్రైలర్ చూడగానే చాలా నచ్చింది. ట్రైలర్ చూశాక కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. ఓ మంచి కుటుంబం ఉండే ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే పాయింట్ బాగా నచ్చింది. సమంత పవర్ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళ ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ అంటూ సమంతతో పాటు చిత్రబృందానికి అభినందనలు' తెలిపారు. -
సీనియర్ NTR డైలాగ్ చెప్పిన హెరోయిన్ భాగ్య శ్రీ
-
బాత్రూంలో జారి పడ్డా.. 48 కుట్లు పడ్డాయి : అఖిల్ అక్కినేని
‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు. లెనిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఏజెంట్ తర్వాత వరసగా సినిమాలు చేయాల్సింది. కానీ ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు బాత్రూంలో పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయి. దీంతో ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. 16 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మూడేళ్ల గ్యాప్ వచ్చింది’ అని అఖిల్ వివరణ ఇచ్చాడు. ఇనేళ్లు గ్యాప్ ఇచ్చినందుకు తన అభిమానులు కోపంగా ఉన్నారని.. మరోసారి అలా జరగదని వాళ్లకు నేను హామీ ఇస్తున్నాను అని అఖిల్ అన్నారు. లెనిన్ విషయానికొస్తే.. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను'
టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్ వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అఖిల్ ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా సినిమా వచ్చి ఇప్పటికీ మూడేళ్లయిందని.. సారీ బ్రదర్.. ఈ విషయంలో నన్ను క్షమించాలంటూ అభిమానులను కోరారు అఖిల్. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సారి నేను మాట్లాడను.. కేవలం నా సినిమానే మాట్లాడుతుందన్నారు. ఇంతకుమించి నేనేం చెప్పకూడదు.. రెండు రోజులుగా నేను నిద్రపోలేదు.. కళ్లద్దాలు పెట్టుకుని వద్దామనుకున్నానని తెలిపారు. మిమల్ని చూస్తుంటే జూలై 10 వరకు పనిచేసే ఎనర్జీ వచ్చిందని అభిమానులను ఉద్దేశించి అఖిల్ మాట్లాడారు. #LENIN is ready to hit hard... and Vizag has already set the tone ❤️🔥❤️🔥 #LeninTrailer - https://t.co/04wGr6WZ2x #LeninOnJuly10th pic.twitter.com/phNA8qkUrw— Sithara Entertainments (@SitharaEnts) June 30, 2026 -
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
-
' శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా?.. లెనిన్ ట్రైలర్ చూశారా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్‌కు నాగార్జున అక్కినేని వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అంశాలు కూడా ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం' అని సునీల్ చెప్పే డైలాగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లోని ఫైట్స్ చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షన్‌ను తలపిస్తోంది. 'కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని.. ఏంది అట్టనే సేద్దామా' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. -
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ సారి వాయిదా పడింది. మే 1న రిలీజ్ కావాల్సి ఉండగా.. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.తాజాగా మరోసారి అఖిల్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. లెనిన్ టీమ్ అభ్యర్థనతో నా దగ్గరికి వచ్చారని.. ప్రేక్షకుడికి వందశాతం అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు మరింత సమయం కావాలని అడిగారని ట్వీట్ చేశారు. వారి అభిరుచి, స్ఫూర్తిని చూసి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చారు. లెనిన్ జూలై 10న విడుదల కానుందని.. మీరు ఒక కొత్త అఖిల్‌ను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు నాగార్జున సూచించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు. Team #Lenin came to me with a request.They asked for a little more time to give their absolute 100% and create something very special.Their passion and spirit made me say yes.మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!Get ready for the #Lenin…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2026 -
అక్కినేని అఖిల్ 'లెనిన్'.. వయొలెంట్ సాంగ్ వచ్చేసింది
అక్కినేని నాగార్జున తనయుడు తనయుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కుదరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.No WAR is more VIOLENT than LOVE ❤️🔥#SoulOfLenin is out now▶️ https://t.co/caQUyeFpz1 MANODU VASTHUNNADU 🔥🔥#Lenin #LeninOnJune26th @MusicThaman Musical 🎶 🎤 @ImVagdevi ✍️ #KalyanChakravarthy@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/Cnm7pLzX5U— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2026 -
జూన్ బాక్సాఫీస్: పెద్దితో పాటు ఆ సినిమాలదే హవా!
ఈసారి బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హవా పెద్దగా కనిపించలేదు. పెద్ద సినిమాలన్నీ అటు షూటింగ్స్ పూర్తి కాక, ఇటు ఐపీఎల్ రావడంతో వాయిదాలు ప్రకటించాయి. దీంతో వేసవిలో చిన్న, డబ్బింగ్ సినిమాల జోరే ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్కువగా బోసిపోయే కనిపించింది. ఇప్పుడు రామ్‌చరణ్ 'పెద్ది'తో మరోసారి బాక్సాఫీస్ కళకళలాడేందుకు సిద్ధమైంది. మరి పెద్దితోపాటు జూన్‌లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..⇒ జూన్ 4- పెద్దిరామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.⇒ జూన్ 5 - హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ మూవీ)బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై'. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. హీరో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న రిలీజవుతోంది.⇒ జూన్ 11- సింగ్ గీతంలెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా 'సింగ్ గీతం'. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 11న విడుదలవుతోంది.⇒ జూన్ 19 - మా ఇంటి బంగారండైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం 'మా ఇంటి బంగారం'. సామ్ భర్త రాజ్ ఈ చిత్రానికి కథ అందించగా, ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 19న బంగారం థియేటర్లలోకి వస్తోంది.⇒ జూన్ 19 - ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'కోరుకున్న ప్రియుడు', 'పెళ్లి' వంటి సినిమాలతో హీరోగా అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వడ్డే నవీన్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.⇒ జూన్ 19- దీవానాశుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం 'దీవానా'. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'మా ఇంటి బంగారం'తో పోటీపడుతూ జూన్ 19న రిలీజవుతోంది.⇒ జూన్ 19 - కాక్టైల్ 2 (హిందీ మూవీ)షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం కాక్టైల్ 2. ఇది 2012లో వచ్చిన కాక్టైల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూన్ 19న విడుదలవుతోంది.⇒ జూన్ 26- లెనిన్నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నట్లు ఈ చిత్రం నెలాఖరులో జూన్ 26న రిలీజవుతోంది.⇒ జూన్ 26- వెల్కమ్ టు ద జంగిల్ (హిందీ చిత్రం)ఇది వెల్కమ్ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం. ఇందులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఇకపోతే జూన్ 22న స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో జూన్ 19న ఆయన చివరి మూవీ జన నాయకన్ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మరి ఈసారైనా సెన్సార్ ఆటంకాలు దాటుకుని జన నాయకన్ విడుదలవుతుందో, లేదో చూడాలి! -
నాగార్జునకు చిన్న కొడుకు సర్ప్రైజ్.. అదేంటో చూసేయండి!
మొదటి అడుగు ఎవరికైనా ప్రత్యేకమే.. కింగ్ నాగార్జున నటించిన మొదటి సినిమా విక్రమ్. ఈ మూవీ విడుదలై నేటి (మే 23)కి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తండ్రికి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు చిన్న కుమారుడు, హీరో అఖిల్. అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' మూవీ టీజర్ వదిలారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.తండ్రికి సర్ప్రైజ్'నా సినీ జీవితం మొదలైన రోజు అఖిల్ నాకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరూ చూడండి, మనోడు వస్తున్నాడు' అని రాసుకొచ్చాడు. లెనిన్ టీజర్ విషయానికి వస్తే.. 'ఏమంటివి ఏమంటివి...' అన్న ఎన్టీఆర్ డైలాగ్‌తో వీడియో మొదలైంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రంగస్థల కళాకారిణిగా ఆ డైలాగ్‌ను స్టేజీపై చెప్తుంది. పల్లె పరిమళంఎన్టీఆర్ అంత కాకపోయినా బానే చెప్పావని మెచ్చుకున్నాడు హీరో అఖిల్. ఇద్దరూ పల్లెటూరి యాసలో డైలాగులు చెప్తూ మెప్పించారు. టీజర్ అయితే అదిరిపోయింది. ఈసారి అఖిల్ చాలా కొత్తగా ట్రై చేశాడని, హిట్టు గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. Today, May 23rd నా సిని జీవితం మొదలైన రోజు Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది మీరు చూడండి. 👉🏽 https://t.co/QG2BFis2XTమనోడు వస్తున్నాడు…. #ManoduVasthunnadu #LeninOnJune26th— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026 -
బర్త్ డే బ్యూటీ.. ట్రెండింగ్ హీరోయిన్ని గుర్తుపట్టారా?
సాధారణంగా సినిమాలు హిట్ అయితే హీరోయిన్లకు క్రేజ్ వస్తుంది. కొన్నిసార్లు ఫలితంతో సంబంధం లేకుండా ఫ్లాప్స్ అందుకున్నా సరే కొందరు బ్యూటీస్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ల ఈమె ఒకరు. మరో రెండు నెలల్లో ఈ భామ హీరోయిన్గా చేసిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన మీసకట్టుతో తలపై కిరీటంతో కనిపిస్తున్న ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ముంబైకి చెందిన ఈమె.. రవితేజ 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీనే ఘోరమైన డిజాస్టర్. అయినా సరే 'కింగ్డమ్', 'కాంత' లాంటి పాన్ ఇండియా మూవీస్‌లో అవకాశాలు అందుకుంది. కానీ ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. గతేడాది చివరలో వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలుకా' కూడా ఫ్లాప్ అయింది.ప్రస్తుతం భాగ్యశ్రీ చేస్తున్న తెలుగు సినిమా 'లెనిన్' మాత్రమే. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చితం.. జూన్ 26న థియేటర్లలోక రానుంది. ఇది హిట్ కావడం అఖిల్‌కి ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే తెలుగులో మరికొన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే పరిస్థితి కష్టమైపోవచ్చు. ఇకపోతే శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'సెయాన్' మూవీతో భాగ్యశ్రీ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?) -
కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ
హీరోగా 100వ సినిమా చేస్తున్న నాగార్జున.. మరోవైపు కొడుకు అఖిల్ 'లెనిన్' చిత్ర బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కి సక్సెస్ దక్కలేదు. దీంతో ఈసారి అంతా పక్కాగా ఉండేలా చూసుకుని 'లెనిన్' తీశారు. కానీ షూటింగ్ ఆలస్యం, 'పెద్ది' కారణంగా ఇది వాయిదా పడింది. చరణ్ సినిమా మరోసారి వాయిదా పడి జూన్ 25కి షిఫ్ట్ కావడంతో అఖిల్ తప్పుకొంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడా విషయంపైనా క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)అఖిల్, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' మూవీని మే 01న థియేటర్లలోకి తీసుకొస్తామని తొలుత ప్రకటించారు. కానీ షూటింగ్, ఇతరత్రా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. జూన్ 26న రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ 'పెద్ది' కూడా జూన్ 25న వస్తుందనేసరికి అఖిల్ సైడ్ అవుతాడని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్పష్టం చేశారు.'నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. మీరు కొత్త అఖిల్‌ని చూస్తారని గర్వంతో నమ్మకంగా చెబుతున్నా. డేట్ గుర్తుపెట్టుకోండి జూన్ 26న థియేటర్లలో కలుద్దాం' అని నాగార్జున ట్వీట్ చేశారు. అంటే 'పెద్ది' చిత్రం 25న వస్తుందని తెలిసినా సరే బరిలో ఉన్నారంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర మెగా vs అక్కినేని అనమాట. ఈ రెండు చిత్రాలు కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ నేపథ్య కథతో తీయడం విశేషం. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఒకరోజు తేడాతో వస్తారా? లేదంటే 'లెనిన్' వాయిదా బాట పడతాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్) -
అక్కినేని హీరో సినిమా.. ఎట్టా ఎట్టా అంటోన్న అఖిల్..!
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎట్టా ఎట్టా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ సాంగ్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ఓ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


