చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫ్రైడే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా మహేశ్ బాబు దూకుడు చిత్రం(ఆగస్టు 09) రీ రిలీజ్ కానుంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే అక్కినేని హీరో అఖిల్ మూవీ లెనిన్ సందడి చేయనుంది. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, మలయాళ చిత్రం హృదయం మురళి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ శుక్రవారమే ఓటీటీకి రానున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07
ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07
ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07
మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07
రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07
అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07
డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07
బిగ్‌చికెన్.. ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్‌స్పరసీ(హాలీవుడ్)- ఆగస్టు 07
లవ్ హర్ట్స్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 07
ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08
జీ5
లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07
వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07
తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07
అమెజాన్ ప్రైమ్
ఓ సుకుమారి(తెలుగు సినిమా)- ఆగస్టు 07
వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07
జియో హాట్‌స్టార్
ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07
మనోరమ మ్యాక్స్
పొంగళ (మలయాళ మూవీ) - ఆగస్టు 07
సన్ నెక్ట్స్..
సత్యతిల్ సంబవిచతు(మలయాళ మూవీ)- ఆగస్టు 07


