రజినీకాంత్ జైలర్-2.. మరో పవర్‌ఫుల్ రోల్ రివీల్..! | Superstar Rajinikanth Jailer 2 Movie Vidya Balan Role Revealed | Sakshi
Sakshi News home page

Jailer 2 Movie: రజినీకాంత్ జైలర్-2.. బాలీవుడ్ నటి రోల్ రివీల్..!

Sep 20 2026 9:21 PM | Updated on Sep 20 2026 9:21 PM

Superstar Rajinikanth Jailer 2 Movie Vidya Balan Role Revealed

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్‌ నుంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ క్యారెక్టర్‌ రివీల్ చేశారు. ఆమె కాంతా అనే పవర్‌పుల్ రోల్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెట్లపై నడుచుకుంటూ.. చేతిలో సిగరెట్‌ పట్టుకుని ఫుల్ మాస్‌ లుక్‌లో కనిపించింది బాలీవుడ్‌ బ్యూటీ.

(ఇది చదవండి: రజినీకాంత్ జైలర్-2.. సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్‌..!)

కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్‌ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement