సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు రోల్‌ను రివీల్ చేశారు. ఈ మూవీలో ఆయన దిలీప్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియో పంచుకున్నారు. ఇందులో కారుపై కూర్చుని సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కనిపించారు. ఇది చూస్తంటే సూరజ్ పవర్‌పుల్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది.
కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Introducing Suraj Venjaramoodu as Dileep from the world of #Jailer2 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial #SurajVenjaramoodu @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju @kabilanchelliah… pic.twitter.com/fqPDTqHo18
— Sun Pictures (@sunpictures) September 18, 2026


