కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ వెట్టువం. ఈ మూవీలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్ సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో దాదాపు ఐదు నిమిషాల వీడియో పంచుకున్నారు. ఇందులో కథ ఎలా ఉండనుందనే విషయాన్ని రివీల్ చేశారు. ఈ కథ మూడు కాలాల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఇందులో నటీనటులు ప్రాచీన యుద్ధ కళలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కోడలు శోభిత సైతం తన పాత్ర కోసం ప్రాచీన యుద్ధకళ నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.
Wow I love the world building!! looks like you put in a lot of work Sobhita … Looks too good😊💐
Waiting for this one!!https://t.co/N9W8IH7BxM
A film by @beemji @officialneelam @LearnNteachprod @Saidevanand3 @mr_saivenkat @arya_offl @vr_dineshravi #SobhitaDhulipala…— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 18, 2026


