బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ నడుస్తోంది. హౌస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు కంటెస్టెంట్స్ శతవిధాల పోటీపడుతున్నారు. ఈ రేసులో ఐదుమంది పోటీలో నిలిచారు. వీరికి బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టి పరుగులు పెట్టించాడు. పదిమంది కంటెస్టెంట్స్‌ను గార్డ్స్‌గా పెట్టగా.. మిగిలిన ఐదుగురు వాళ్లను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలి.
ఈ టాస్క్‌లో షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం జరిగింది. షాలినిని వయసులో నువ్వు చిన్నదానివంటూ వర్షిణి అనడంతో మాటమాట పెరిగింది. దీంతో కాసేపు వీరిద్దరి మధ్య మాటలతో బిగ్‌బాస్ హౌస్ హోరెత్తింది. ఈ ప్రోమో చూస్తుంటే కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ ఎవరినీ వరిస్తుందో తెలియాలంటే మీరూ కూడా బిగ్‌బాస్ చూసేయాల్సిందే.


