బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రేసులో భాగంగా లెవెల్-2లో పోటీదారులకు వరుసగా టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో తొలి టాస్క్‌లో రోహిత్ తన సత్తా చాటలేకపోవడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో దెబ్జానీ, రాంప్రసాద్, త్రిగుణ్ మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా మిగిలారు. అసలు నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది..! ఒకసారి చూద్దాం రండి!
ఇదీ చదవండి: ఈ ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..!
స్పీడ్ అండ్ సక్సెస్..
లెవెల్-2లో మిగిలిన సభ్యులకు బిగ్‌బాస్ ‘స్పీడ్ అండ్ సక్సెస్’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌ను రెండు స్టేజ్‌లుగా నిర్వహించారు. మొదటి స్టేజ్‌లో పోటీదారులు స్టార్టింగ్ పాయింట్ నుంచి టేబుల్ కింద ఉన్న సందుల్లోంచి ముందుకు వెళ్లాలి. అనంతరం టేబుల్‌పై ఉన్న గ్యాప్స్‌లో వేళ్లు పెట్టి.. పైన ఉంచిన ఐదు డిస్కుల్లో ఒక్కో డిస్క్‌ను బయటకు తీసుకురావాలి. అలా తీసుకున్న డిస్క్‌ను టేబుల్‌పై ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎండింగ్ పాయింట్ వరకు జరిపి కిందకు పడేలా చేయాలి.
ఆ తర్వాత ఎదురుగా ఉన్న టైర్లలో కాళ్లు పెడుతూ వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి. చివరికి డిస్క్‌ను నిర్ణయించిన లైన్ దగ్గర పెట్టాలి. ఇలా ఐదు డిస్కులను లైన్ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత రెండో స్టేజ్ ప్రారంభమవుతుంది. రెండో స్టేజిలో లైన్ దగ్గర నిలబడి.. తాము తీసుకొచ్చిన ఐదు డిస్కులను ఎదురుగా ఉన్న టేబుల్‌పైకి ఒక్కొక్కటిగా విసిరి ల్యాండ్ చేయాలి. నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన ఇద్దరు విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. విజేతలే కెప్టెన్సీ కంటెండర్లుగా కొనసాగుతారని, చివరి స్థానంలో నిలిచిన వారు కెప్టెన్సీ రేసు నుంచి నిష్క్రమిస్తారని తెలిపాడు. ఈ టాస్క్‌కు నరేశ్‌ను సంచాలకుడిగా నియమించారు. పోటీదారులు గెలుపు కోసం హోరాహోరీగా పోటీ పడగా.. చివరికి రాంప్రసాద్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
మళ్లీ హౌస్‌లోకి చరణ్..
ఇక అందరూ ఊహించినట్లుగానే చరణ్ మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడి రాకతో హౌస్‌లో సందడి నెలకొంది. వచ్చిరావడంతోనే ఈసారి తన టాలెంట్ ఏంటో చూపిస్తానని గట్టి పంతానే విసిరాడు. మరోవైపు నరేశ్, రాంప్రసాద్ అక్కడున్న కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ కాసేపు నవ్వులు పూయించారు.
త్రిగుణ్‌కు స్పెషల్ పవర్..
కొత్తగా హౌస్‌లోకి వచ్చిన త్రిగుణ్‌కు బిగ్‌బాస్ ఓ ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని కెప్టెన్సీ రేసులో పాల్గొనకుండా చేయడంతో పాటు.. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన వారిలో ఒకరితో ఛాలెంజ్ చేసి గెలిస్తే తాను కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కల్పించాడు. ఈ రెండు ఆప్షన్లలో చరణ్ రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. దీంతో అప్పటికే కెప్టెన్సీ కంటెండర్‌గా ఉన్న త్రిగుణ్‌తో ఛాలెంజ్‌కు సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. చివరికి త్రిగుణ్ విజేతగా నిలిచినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చీ రావడంతోనే చరణ్‌కు ఇది మొదటి అపజయం.
ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..


