మహేశ్ బాబు ఇంట గణేశుడి నిమజ్జనం.. వీడియో వైరల్ | Ganesh Nimajjanam at Hero Mahesh Babu house video goes viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్ బాబు ఇంట గణేశుడి నిమజ్జనం.. వీడియో వైరల్

Sep 17 2026 9:23 PM | Updated on Sep 17 2026 9:23 PM

Ganesh Nimajjanam at Hero Mahesh Babu house video goes viral

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇంట వినాయక నిమజ్జనం వేడుక నిర్వహించారు. గణనాథుని పూజలు చేసిన  తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి వీడ్కోలు పలికారు. మహేశ్ బాబు కూతురు సితార వినాయకుడిని తన చేతుల మీదుగా ఎత్తుకుని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వేడుకలో మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని మోస్ట్ అడ్వెంచరస్‌గా అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement