ఆకాశంలో ఒక తార.. వచ్చేది ఎప్పుడంటే? | Dulquer Salmaan Aakasamlo Oka Tara Movie release date | Sakshi
Sakshi News home page

Aakasamlo Oka Tara Movie: ఆకాశంలో ఒక తార.. వచ్చేది ఎప్పుడంటే?

Sep 17 2026 6:02 PM | Updated on Sep 17 2026 7:06 PM

Dulquer Salmaan Aakasamlo Oka Tara Movie release date

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తేదీని ఖరారు చేశారు మేకర్స్. ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు.

ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ మూవీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ అఫీషియల్‌గా ప్రకటించింది. నక్షత్రాల వైపు ప్రయాణం మొదలైంది..నవంబర్ 20, 2026న థియేటర్లకు రండి..మీ కోసం ఒక అందమైన ప్రపంచం వేచి ఉందంటూ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.. నవంబర్ 20న ఈ ప్రపంచాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి వేచి ఉండలేనంటూ హీరో దుల్కర్ సల్మాన్ రాసుకొచ్చాడు. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్  కృష్ణ అనే పాత్రలో కనిపించనుండగా.. వ్యోమగామి కావాలని కలలు కనే గ్రామీణ యువతిగా సాత్విక నటించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement