మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న మూవీ కాగా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో చిరు నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుంది.
అయితే చిరంజీవి నటించిన మరో మూవీ విశ్వంభర. ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే డేట్ ప్రకటించిన కాకా వాయిదా పడనుందనే టాక్ వినిపించింది. దీంతో కాకా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
కాకా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో కాకా వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్‌పడింది. మరి విశ్వంభర రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy— KVN Productions (@KvnProductions) September 17, 2026


