జూనియర్ ఎన్టీఆర్ దేవర బ్యూటీ.. ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది..! | Devara actressShruti Marathe Viral On Social Media for This reason | Sakshi
Sakshi News home page

Shruti Marathe: జూనియర్ ఎన్టీఆర్ దేవర బ్యూటీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

Sep 16 2026 9:33 PM | Updated on Sep 16 2026 9:41 PM

Devara actressShruti Marathe Viral On Social Media for This reason

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా దేవర-2 కూడా ఉందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

దేవర భార్యగా శృతి..

అయితే దేవరలో ఎన్టీఆర్ భార్యగా మెప్పించిన బ్యూటీ శృతి మరాఠే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. ఇందులో కేవలం నటనతో మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా శృతి పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇప్పుడు ఉన్నట్లుండి శృతి మరాఠే నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఆమె పేరు ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు శృతి ఇప్పుడెందుకు ట్రెండ్‌ అవుతుందో మనం కూడా తెలుసుకుందాం.

స్పెషల్ ‍అట్రాక్షన్‌గా శృతి..

దేవరలో ఎన్టీఆర్ భార్యగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో సందడి చేసింది. ముంబయిలో గణేశ్ ఆగమన్ సందర్భంగా హీరోయిన్ శృతి మరాఠే బ్యాండ్ వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇందులో శృతి డోలు వాయిస్తూ స్పెషల్ ‍అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెను చూసిన నెటిజన్స్‌ దేవరలో హీరోయిన్‌గా శృతినే తీసుకోవాల్సిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement