బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్ షా ఈ ఏడాది మార్చిలో నటి ఇషా రిఖీని పెళ్లాడారు. అంతకుముందే జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ర్యాపర్.. ఆమెతో విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈ జంటకి ఓ కూతురు కూడా ఉంది. ఆ తర్వాత నటి ఇషా రిఖితో డేటింగ్ చేసిన బాద్‌షా ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.
అయితే నటి ఇషా రిఖితో రెండో పెళ్లి కూడా ఆర్నెళ్లకే పెటాకులైంది. ఇటీవలే ఈ జంట విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా నటి ఇషా రిఖి.. తన పెళ్లి జీవితానికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు పంచుకుంది. బాద్‌షాతో పెళ్లయ్యాక తీవ్రమైన వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. తాను శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా మోసపోయానని తెలిపింది. బాద్‌షా తనను అన్ని రకాలుగా మోసం చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో ఉన్న ఇషా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది.
ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేది తాను నమ్మనని స్పష్టం చేసింది. తాను స్వయంగా చూసేంత వరకు నమ్మనని పేర్కొంది. కానీ కొన్ని నెలలకే తనను మోసం చేశారని గ్రహించానని చెప్పింది. బాద్‌షా తనను కేవలం కొద్దిమందికి మాత్రమే పరిచయం చేశారని..వాస్తవానికి దూరంగా తనలోని వికృత రూపాన్నిచూపించారని వాపోయింది.
ఈ రిలేషన్‌లో తనకు అనుమానాలు కలిగినప్పటికీ.. అన్ని విషయాలను స్వయంగా చూసేంత వరకు నమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు ఇషా వెల్లడించింది.


