ఆస్పత్రిలో సెలైన్‌ బాటిల్‌తో శ్రీహరి భార్య.. ఫోటో వైరల్‌ | Srihari Wife Disco Shanti Disco Shanti Hospital Photo Viral | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సెలైన్‌ బాటిల్‌తో శ్రీహరి భార్య.. ఫోటో వైరల్‌

Sep 16 2026 3:53 PM | Updated on Sep 16 2026 4:44 PM

Srihari Wife Disco Shanti Disco Shanti Hospital Photo Viral

దివంగత నటుడు, రియల్‌స్టార్‌  శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌ బాటిల్స్‌తో కనిపించింది. ఈ ఫోటోని స్వయంగా డిస్కో శాంతినే తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ తన హెల్త్‌ కండీషన్‌పై అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. ఆస్పత్రి నుంచి ఇంటికి కూడా చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. అయితే ఆస్పత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందనేది మాత్రం చెప్పలేదు. ఏదేమైనా ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుందని, అదే చాలని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా చేస్తున్న ఆస్మాన్ చిత్రం నుంచి ఈ రోజే టీజర్‌ రిలీజ్‌ అయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కి డిస్కో శాంతి హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగానే ఆమె ఈవెంట్‌కి రానట్లు సమాచారం.

(ఇదీ చదవండి: హాలీవుడ్‌లోకి ‘మహారాజా’.. తొలి చిత్రంగా రికార్డు!)

డిస్కో శాంతి విషయానికి వస్తే.. హీరోయిన్ గా చేయకపోయిన్పటికీ అంతకు మించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 90’sలో సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా డిస్కో శాంతి ఉండాల్సిందే. బంగారు కోడి పెట్ట లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులేసిందీ శాంతి. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డిస్కో శాంతి. పెళ్లి తర్వాత సినిమాలను బాగా తగ్గించేశారామె. ఇక 2013లో శ్రీహరి మరణం తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.  ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలే జీవితంగా జీవనం గడుపుతున్నారామె. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement