బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లతో హౌస్‌మేట్స్ పోటీ పడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ హాట్‌హాట్‌గా సాగుతోంది.
తాజాగా పదో రోజుకు సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బ్యాగ్ కోసం పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. ఈ గేమ్‌లో రెండు టీమ్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్‌లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


