Photo Credit: Masaba Gupta Instagram
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో సర్ వివియన్ రిచర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్‌తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి.. స్టైలిష్‌గా షాట్లు బాదే ఈ ‘స్వాగర్’పై అప్పట్లో చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు.
అలా పరిచయం
అందులో బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఒకరు. ఎనభైవ దశకంలో జైపూర్ మహారాణి ఇచ్చిన విందులో రిచర్డ్స్‌ను నేరుగా కలిసే అవకాశం వచ్చింది నీనాకు. అంతకుముందు రోజే అతడి మ్యాచ్ చూసిన ఆమెకు రిచర్డ్స్‌తో పరిచయం చెప్పలేని సంతోషాన్నిచింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, రిచర్డ్స్ వెస్టిండీస్‌కు తిరిగి వెళ్లిపోయిన తర్వాత కాంటాక్ట్ మిస్ అయింది. ఓ రోజు అనుకోకుండా ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకున్నారు. అప్పటి నుంచి స్నేహం పెరిగి ఇద్దరి మధ్య ‘బంధం’ మొదలైంది.

అప్పటికే అతడికి పెళ్లి అయిపోయింది
అలా ఇద్దరూ ఒక్కటి కాగా.. నీనా గుప్త గర్భం దాల్చింది. అయితే, అప్పటికే వివియర్ రిచర్డ్స్ వెస్టిండీస్‌కు వెళ్లిపోగా... ఆ తర్వాతే నీనాకు ఈ విషయం తెలిసింది. అయితే, అప్పటికే వివియన్ రిచర్డ్స్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇలాంటి తరుణంలో గర్భం కొనసాగించేందుకు నిర్ణయించుకున్న నీనా గుప్తా.. కూతురు మసాబా గుప్తాకు 1989లో జన్మనిచ్చింది. సింగిల్ పేరెంట్‌గా ఆమెను పెంచి పెద్ద చేసి ఫ్యాషన్ డిజైనర్‌గా తీర్చిదిద్దింది.
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు గుర్తు చేసుకున్న నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. దీంతో మరోసారి వీరి రిలేషన్‌షిప్ మరోసారి తెరమీదకు వచ్చింది.
ఇక తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూన్ తో’లోనూ నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్ గురించి ప్రస్తావించింది. ‘‘వివియన్‌కు, నాకు మధ్య అఫైర్ నడిచింది. అలా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తల్లిని కాబోతున్నానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

అయితే, తన బిడ్డను మోయాలా? లేదా? అనే విషయాన్ని వివియన్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నా. నేను గర్భవతినన్న విషయం తెలిసేసరికే వివియన్ వెస్టిండీస్ చేరుకున్నాడు. ఎలాగోలా అతడి నంబర్ సంపాదించి ప్రెగ్నెంట్ అన్న విషయం చెబితే నాకు నచ్చినట్లే ముందుకు సాగమని చెప్పాడు. తన బిడ్డను కనడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు’’ అని నీనా పేర్కొంది.
అందుకే పెళ్లి చేసుకోలేదు
ఇక మరో ఇంటర్వ్యూలో వివియన్ రిచర్డ్స్‌ను నిజంగానే ప్రేమించి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న నీనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడిని ఇదే ప్రశ్న అడగడానికి చాలా మంది భయపడతారు. మరి నన్నెందుకు ఇంత సులువుగా అడిగేస్తున్నారు. మేము ప్రేమించుకున్నామనే నేను అనుకుంటున్నాను.
కలిసి ఉన్న కొంతకాలంలోనే మాకు ఎన్నో మధురు జ్ఞాపకాలు మిగిలాయి. నటిగా ఉండటం నాకిష్టం. వివియన్‌ను పెళ్లి చేసుకుని నేను విండీస్‌కు వెళ్లలేను. అతడు కూడా నా కోసం తన కెరీర్ వదులుకుని ఇండియాకు రాలేడు. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’’ అని నీనా తెలిపింది.
మసాబాకు సారీ చెప్తూనే ఉంటా
అదే విధంగా.. ‘‘ఏదేమైనా నేను పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాల్సి కాదు. ప్రతీ బిడ్డకు తల్లి.. తండ్రి.. ఇద్దరి ప్రేమా అవసరం. నేను నా కూతురు మసాబాకు ఈ విషయంలో రోజూ క్షమాపణలు చెబుతూ ఉంటా. తండ్రి లేకుండా పెరిగే క్రమంలో తను చాలా బాధ పడింది. కానీ నాపై మాత్రం ఆమెకు ప్రేమ తగ్గలేదు’’ అని నీనా గుప్తా ఉద్వేగానికి లోనైంది.

కాగా మసాబాకు తండ్రి వివియన్ రిచర్డ్స్‌తో మంచి అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మసాబా తన తండ్రిని కలుసుకుంటూ ఉంటుంది. నీనా, ఆమె భర్త సైతం అతడితో స్నేహంగానే ఉంటారు. మసాబా పెళ్లిలో వీరు ముగ్గురు కలిసి కనిపించడం విశేషం.
ఎవరి జీవితాల్లో వారు బిజీ
ఇదిలా ఉంటే.. నీనా గుప్తా తనకు 49 ఏళ్ల వయసు ఉన్నపుడు 2008లో వివేక్ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. అమెరికాలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది. మరోవైపు.. వివియన్ రిచర్డ్స్- మిరియం రిచర్డ్స్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. నీనాతో రిలేషన్‌షిప్ తర్వాత వివియన్- మిరియం మధ్య విభేదాల కారణంగా కొన్నాళ్లు దూరంగా ఉన్నట్లు సమాచారం.

కాగా 74 ఏళ్ల వివియన్ రిచర్డ్స్ 1974- 1991 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. వెస్టిండీస్ తరఫున 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తన అద్భుతమైన ఆట తీరుతో సర్ వివియన్ రిచర్డ్స్‌గా ఖ్యాతిగాంచాడు.


