టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌..! | Vipraj Nigam to replace Varun Chakaravarthy in the Asian Games squad | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌..!

Sep 16 2026 2:44 PM | Updated on Sep 16 2026 4:01 PM

Vipraj Nigam to replace Varun Chakaravarthy in the Asian Games squad

source: BCCI X

ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గాయపడిన (సైడ్ స్ట్రెయిన్) విషయం తెలిసిందే. గాయం పెద్దది కావడంతో వరుణ్‌ ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌తో పాటు ఏషియన్‌ గేమ్స్‌కు కూడా దూరమయ్యాడని తెలుస్తోంది.

ఈ క్రమంలో భారత మేనేజ్‌మెంట్‌ ఏషియన్‌ గేమ్స్‌ కోసం వరుణ్‌ ప్రత్యామ్నాయంగా ఎవరూ ఊహించని ప్లేయర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. 22 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్నర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

వరుణ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు విప్రాజ్ నిగమ్‌తో పాటు కుల్దీప్ యాదవ్ పేరును కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్ ఈ నెలాఖర్లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్న నేపథ్యంలో విప్రాజ్ నిగమ్‌ను ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయమై అతి త్వరలో అధికారిక సమాచారం రావొచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విప్రాజ్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అతడు తన సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్‌లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ సుమారు 176గా ఉంది.

సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం
జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే పురుషుల క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతాయి. భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్ దశలో బరిలోకి దిగనుంది.

ఇదీ చదవండి: శతక్కొట్టిన హ్యారీ బ్రూక్‌.. ప్రపంచ రికార్డు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement