source: BCCI X
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. నితీశ్ కుమార్ రెడ్డి (3-0-24-3), అర్షదీప్ సింగ్ (4-0-35-2), జస్ప్రీత్ బుమ్రా (4-1-25-1), అక్షర్ పటేల్ (4-0-28-1), రవి బిష్ణోయ్ (4-0-32-1) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.
ఆఖర్లో రషీద్ ఖాన్ (28) బ్యాట్ ఝులిపించడంతో ఆఫ్ఘన్ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 11, మొహమ్మద్ నబీ (15), నూర్ అహ్మద్ (7 నాటౌట్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు


