ఆసీస్‌పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు ‍కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్‌ | Zimbabwes Newman Nyamhuri Sets Records Vs Australia | Sakshi
Sakshi News home page

ఆసీస్‌పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు ‍కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్‌

Sep 15 2026 6:34 PM | Updated on Sep 15 2026 6:46 PM

Zimbabwes Newman Nyamhuri Sets Records Vs Australia

source: X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే యువ పేసర్ న్యూమన్ న్యామ్‌హురి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి జింబాబ్వే పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు.

అలాగే ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు స్పిన్నర్‌ ర్యాన్ బర్ల్ ఈ ఘనత సాధించాడు.

మరో ఘనత
న్యామ్‌హురి తాజా ప్రదర్శనతో మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన (20 ఏళ్ల 239 రోజులు) జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ల్యూక్ జోంగ్వే (20 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో న్యామ్‌హురి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (18 ఏళ్ల 266 రోజులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన సక్లైన్ ముష్తాక్ (19 ఏళ్ల 352 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యామ్‌హురి ఐదేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులకే పరిమితమైంది. న్యామ్‌హురి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్‌ 300కు పైగా స్కోర్‌ చేయలేకపోయింది. 

న్యామ్‌హురి తన స్పెల్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, ఆలివర్ పీక్‌లతో పాటు సెంచరీ సాధించిన మ్యాట్ రెన్షాను (109) ఔట్‌ చేశాడు.

రెన్షాతో పాటు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కూపర్‌ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (36), ఒలివర్‌ పీక్‌ (30), అలెక్స్‌ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్‌ హెడ్‌ (4), జోష్‌ ఇంగ్లిస్‌ (4), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (5) నిరాశపరిచారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది.

ఇదీ చదవండి: సచిన్‌ వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement