మరో లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న వార్నర్‌ | David Warner To Make Nepal Premier League Debut This Year | Sakshi
Sakshi News home page

మరో లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న వార్నర్‌

Sep 15 2026 4:26 PM | Updated on Sep 15 2026 4:39 PM

David Warner To Make Nepal Premier League Debut This Year

source: X

ఆస్ట్రేలియా డాషింగ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరో క్రికెట్‌ లీగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సీజన్‌ నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. ఖాట్మండు గోర్ఖాస్‌ ఫ్రాంచైజీతో వార్నర్‌ ఒప్పందం చేసుకున్నాడు. నేపాల్‌ ప్రీమియర్‌లో ఆడటం వార్నర్‌కు ఇదే మొదటిసారి.

ఖాట్మండు గోర్ఖాస్ జట్టులో వార్నర్‌తో పాటు మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ కూడా ఉన్నాడు. ఈ జట్టుకు నేపాల్ ఆటగాడు కరణ్ కేఎస్ నాయకత్వం వహిస్తాడు. 2024లో లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి గోర్ఖాస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. 2025 ఎడిషన్‌లో ఎలిమినేటర్‌లో ఓటమిపాలైంది.

వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక, ప్రపంచవ్తాప్తంగా లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడు చివరిగా ఇదే ఏడాది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడాడు. ఆ టోర్నీలో కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగి ఏడు ఇన్నింగ్స్‌ల్లో 51.20 సగటున, 150 స్ట్రైక్‌రేట్‌తో 256 పరుగులు చేశాడు.

టీ20ల్లో మేటిగా గుర్తింపు తెచ్చుకున్న వార్నర్‌కు ఐపీఎల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో అతడు ఏకంగా 184 మ్యాచ్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి 2016లో ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక ఆటగాడిగాయ కొనసాగుతున్నాడు.

చదవండి: కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్‌



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement