మాజీ కెప్టెన్‌ డేవిడ్ వార్న‌ర్‌కు ప్ర‌మోష‌న్‌ | David Warner-Will-Lead-Ponting-Owned-Australia-Champions-WCL 2026 | Sakshi
Sakshi News home page

మాజీ కెప్టెన్‌ డేవిడ్ వార్న‌ర్‌కు ప్ర‌మోష‌న్‌

Sep 8 2026 6:38 PM | Updated on Sep 8 2026 6:51 PM

David Warner-Will-Lead-Ponting-Owned-Australia-Champions-WCL 2026

Photo Credit: Twitter

వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్‌) మూడో సీజ‌న్ కోసం ఆస్ట్రేలియా చాంపియ‌న్స్ జ‌ట్టు త‌మ కెప్టెన్‌గా మాజీ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌ను ఎంపిక చేసింది. కాగా ఈ జ‌ట్టుకు ఆసీస్ దిగ్గ‌జం రికీ పాంటింగ్ య‌జ‌మానిగా ఉన్నాడు. మూడో సీజ‌న్‌లో త‌న‌తో పాటు పునీత్ సింగ్ కూడా జ‌ట్టు య‌జ‌మానిగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు పాంటింగ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు.  

"మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వ‌డ‌మే గాక గొప్ప ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆడుతుండ‌డం నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నా. అంతేకాదు మా ఆట‌తీరుతో అభిమానుల‌ను అల‌రించ‌బోతున్నామ‌న్న విష‌యం సంతోషం క‌లిగిస్తుంది" అని వార్న‌ర్ చెప్పుకొచ్చాడు. 

పాంటింగ్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియ‌న్ చాంపియ‌న్స్ జ‌ట్టులో భాగం కావ‌డం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. పునీత్‌తో పాటు జ‌ట్టుతో క‌లిసి ప‌నిచేయ‌డం కోసం ఎదురుచూస్తున్నా. డేవిడ్ నాయ‌క‌త్వంలో మా జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి అభిమానుల‌ను అల‌రిస్తుంద‌ని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. 

ఇక వ‌రల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌)టోర్నీ మూడో సీజ‌న్ అక్టోబ‌ర్ 3న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి యూఏఈ ఆతిథ్య‌మివ్వ‌నుంది. అయితే ఈ టోర్నీ యూకే వెలుప‌ల జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. లెజెండ్స్ క్రికెట్ లీగ్ మూడో సీజ‌న్‌లో వార్న‌ర్‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు యువ‌రాజ్ సింగ్‌, ఏబీ డివిలియ‌ర్స్‌, డ్వేన్ బ్రావో, షాహిద్ అఫ్రిది, మోయిన్ అలీ, మ‌హ్మ‌దుల్లా స‌హా ఇత‌ర క్రికెట‌ర్లు ఆడ‌నున్నారు. 

ఇక మూడో సీజ‌న్‌కు బంగ్లాదేశ్ చాంపియ‌న్ల‌ను చేర్చ‌డం ద్వారా డ‌బ్ల్యూసీఎల్ త‌న అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యాన్ని విస్త‌రించింది. మొద‌టి సీజ‌న్‌లో పాక్‌ను ఓడించి ఇండియా లెజెండ్స్‌ చాంపియ‌న్‌గా నిల‌వ‌గా, రెండో సీజ‌న్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్ టైటిల్ నెగ్గారు.

Read: పాక్‌తో క‌య్యానికి కాలు దువ్విన ఆఫ్గ‌న్ క్రికెట్ బోర్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement