దుమ్మురేపిన దీప్తి శర్మ | India Player Rises In ICC Womens Rankings After Heroics vs Pakistan In Asia Cup 2026 | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన దీప్తి శర్మ

Sep 8 2026 5:23 PM | Updated on Sep 8 2026 5:31 PM

India Player Rises In ICC Womens Rankings After Heroics vs Pakistan In Asia Cup 2026

source: X

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ దుమ్మురేపింది. ఆసియా కప్‌ 2026లో అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్న ఆమె, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో భారత బౌలర్‌ శ్రీ చరిణి టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకోగా.. మరే భారత బౌలర్‌ టాప్‌-10లో లేరు.

బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత బ్యాటర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ 5, 7, 10 స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆసీస్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ సైతం టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

పిసినారి దీప్తి
ఆసియా కప్‌లో దీప్తి అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోకేవలం 1.90 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. థాయ్‌లాండ్‌పై 3/0, హాంకాంగ్‌-చైనాపై 3/9, పాకిస్తాన్‌పై 2/5 గణాంకాలతో చెలరేగింది.

భరతం పట్టిన స్పిన్నర్లు
తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు పాక్‌ ప్లేయర్ల భరతం పట్టారు. శ్రీ చరణి, ప్రేమ రావత్‌ చెరో మూడు వికెట్.. దీప్తి రెండు వికెట్ల చెలరేగి పాక్‌ ఇన్నింగ్స్‌ను 55 పరుగులకే కుప్పకూల్చారు. ఆతర్వాత బ్యాటర్లు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్‌ అప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్‌-యూఏఈ మ్యాచ్‌ విజేతతో భారత్‌ సెమీస్‌లో తలపడుతుంది. మరోవైపు పాకిస్తాన్‌, శ్రీలంక రెండో సెమీస్‌లో పోటీపడతాయి. భారత్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 10న, శ్రీలంక-పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 11న జరుగునున్నాయి.

చదవండి: క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement